vote

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

Submitted by arun on Fri, 12/07/2018 - 12:20

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బంజారాహిల్స్‌లోని సెయింట్ నిజామిస్ స్కూల్ లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు స్థానిక యువతీ యువకులు పోటీపడ్డారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసిన వచ్చిన తరువాత, తన వేలికున్న సిరాను చూపుతూ "నాపై రంగు పడింది (iam inked), మీపై..?" అని కామెంట్ పెట్టారు. మీరు ఇంకా ఓటు వేయనట్లయితే, వెంటనే వెళ్లి ఓటేసి రండి అని కూడా వ్యాఖ్యానించారు.

క్యూలో నిలబడి ఓటేసిన ఎంపీ కవిత

Submitted by arun on Fri, 12/07/2018 - 11:40

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత నిజామాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోతంగల్‌లోని 177వ నెంబర్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. ఓటర్లతో కలిసి క్యూలైన్‌లో నుంచొని కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి ఓట్లు వేశారు. ఉదయం 11గంటల వరకూ 23.17శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు.. ప్రలోభ నేతలకు జనగామ జిల్లా కోమళ్ల వాసి వినూత్న ప్రచారం

Submitted by santosh on Thu, 12/06/2018 - 19:06

ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్య బ్రహ్మాస్త్రం. దేశ తలరాతను మార్చే పాశుపతాస్త్రం. అలాంటి పవర్‌ఫుల్‌ వెపన్‌ అయిన ఓటును కొనేందుకు కొందరు అభ్యర్థులు ప్రయత్నిస్తే, మరికొందరు ఓటర్లు అమ్ముకుంటున్నారని ఎన్నో నివేదికలు, నిదర్శనాలున్నాయి. ఇలాంటి ప్రలోభాలు, ఓట్ల కొనడాలు, అమ్ముకోవడాలు చూసి, విసిగి వేసారింది ఓ కుటుంబం. వినూత్న ప్రయత్నం చేసింది. ప్రతిఒక్కరిలోనూ చైతన్యం నింపుతోంది. ఇంతకీ ప్రలోభాలపై ఆ కుటుంబం చేసిన ప్రయత్నమేంటి? అలాంటి డైలమాలు, కన్ఫ్యూజన్‌లకు ఆస్కారం లేకుండా జనగామ జిల్లా కోమళ్ల వాసి ఓ వినూత్న ప్రచారానికి తెరలేపాడు.

ఓటుపై ఓ యువకుడి వినూత్న ప్రచారం

Submitted by arun on Fri, 11/02/2018 - 17:52

ఇది ఎన్నికల సమయం జోరుగా కాసుల వర్షం కురుస్తుంది. ఓట్లను కొనేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతారు మద్యం పంచుతారు బహుమతులు అందిస్తారు కాని నేటి తరంలో చైతన్యం వచ్చింది. నోటుతో ఓటును కొనలేరంటూ చెబుతున్నారు. కరీంనగర్ లో ఓ యువకుడి ప్ల కార్డు అందరిని ఆలోచింపజేస్తోంది. 

ఓటుకు నోటు మీరు మాకు ఓటేయ్యండి మేము మీకింతిస్తామంటారు నగదు, మద్యం, నజరానాలతో ఓటర్లకు ఎరలు వేయడం అభ్యర్థులకు అలవాటు. కరీంనగర్ కు చెందిన అలీం పండ్ల వ్యాపారి. రోజంతా కష్ట పడితే వచ్చేది చాలా తక్కువ. ఉన్నది పేదరికంలో ఎన్నికల సమయంలో కొంత సంపాదించుకునే అవకాశం ఉంది. అయినా తన ఆత్మగౌరవాన్నిఅమ్ముకోకూడదని భావించాడు.