amit shah

చంద్రబాబుపై బీజేపీ ఎదురుదాడి

Submitted by arun on Sat, 03/17/2018 - 18:09

ఢిల్లీలోని అమిత్‌షా నివాసంలో ఏపీ బీజేపీ నేతలతో కీలక భేటీ జరిగింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు జాతీయ స్థాయిలో పావులు కదుపుతుండటంపై ఈ భేటీలో చర్చించారు. అలాగే, టీడీపీతో తెగదెంపుల తర్వాత ఏపీలో బీజేపీ ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజలకు వివరిస్తూ.. టీడీపీ వైఖరి ఎండగట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఏపీ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలు..ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం

Submitted by arun on Sat, 03/17/2018 - 12:30

హస్తినలో ఏపీ కేంద్రంగా రాజకీయాలు త్వరత్వరగా మారుతున్నాయి. చిరకాల మిత్రపక్షం అయిన తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం.. అవిశ్వాసం పెట్టడం వంటి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులను ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో.. ఏపీ నాయకులు కీలక సమావేశం కానున్నారు. 

బీజేపీకి డేంజర్ బెల్స్

Submitted by arun on Fri, 03/16/2018 - 17:15

దేశంలో మోడీ హవా తగ్గుతోందా..? బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? వివిథ రాష్ట్రాల్లో  వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి...? బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్‌తో పాటు సిట్టింగ్ సీటు ఫూల్ పూర్‌లో బీజేపీ పరాజయం దేనికి సంకేతం. 2014లో లోక్‌సభలో 282గా ఉన్న బీజేపీ సీట్లు... నాలుగేళ్ళల్లో 272కి తగ్గడం దేనికి సూచిక..?

ఈశాన్య రాష్ట్రాలు.. కర్ణాటక, రాజస్థాన్ ఒక్కటేనా?

Submitted by arun on Mon, 03/05/2018 - 15:29

నిజమే. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించిన మాట వాస్తవమే. ఈ గెలుపుతో.. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. కొన్ని చోట్ల.. బీజేపీ మిత్ర పక్షంగా ఉండగా.. అధికారంలో మరో పార్టీ రాజ్యాలను ఏలుతున్నాయి. అయినా.. ఆ పార్టీలు ఎన్డీయేలో భాగం కాబట్టి.. 21 రాష్ట్రాల్లో కమలం వికసించిందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.

కాషాయ వ్యూహాలేంటి?

Submitted by arun on Sat, 03/03/2018 - 15:44

2013 త్రిపుర ఎన్నికల్లో 59 స్థానాల్లో దాదాపు 49 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. కేవలం 1.5 శాతం ఓటు షేరు మాత్రమే సాధించింది. కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసింది. ఒక ఎన్టీఆర్, ఒక కేజ్రివాల్‌ లెవల్లో అనూహ్యంగా త్రిపురలో విజయఢంకా మోగించింది. అసలు జీరో నుంచి హీరోగా కాషాయదండు ఎలా అడుగులు వేసింది నార్త్ ఈస్ట్‌లో మోడీ మ్యాజిక్‌ ఎలా పని చేసింది బీజేపీ విజయానికి కారణాలేంటి అది అనుసరించిన వ్యూహాలేంటి త్రిపురలో విక్టరీ క్రెడిట్‌ కేవలం మోడీ, షాలదేనా...దీని వెనక ఇంకా ఎవరున్నారు?

పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలి

Submitted by arun on Mon, 02/05/2018 - 10:39

పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలని అమిత్ షా అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం మాటలను నేతలు ఎందుకు లెక్క చేయడం లేదు వ్యూహాత్మకంగానే టీడీపీని బీజేపీ టార్గెట్ చేసిందా ? ఒక వేళ విమర్శలు చేసినా...వ్యక్తిగతంగానే చేశామని తప్పించుకుంటారా ?

తెలంగాణ బీజేపీలో వలస భయం..మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెళ్లిపోతారని ప్రచారం

Submitted by arun on Wed, 01/10/2018 - 14:44

నిన్నమొన్నటి దాక కాంగ్రెస్‌ను వణికించిన వలసల భయం ఇప్పుడు  బీజేపీకి చుట్టుకుంది. భవిష్యత్తు మాదే అని చెప్పే కమలనాధులకు తెలంగాణలో అసంతృప్తులు ఆందోళన కల్గిస్తున్నాయి. పార్టీలోకి భారీగా వలసలు వచ్చుడేమో గాని.. భారీగా వలసలు పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కమలం పార్టీ ఆపసోపాలు పడుతోంది. 

గుజరాత్ ఫలితాలపై కమలనాథుల్లో కలవరం

Submitted by arun on Tue, 12/19/2017 - 11:17

గుజరాత్ ఫలితాలు బీజేపీలో కలవరాన్ని పెంచాయా? పైకి నవ్వుతూ, స్వీట్లు పంచుకుంటున్న కమలనాథులు లోలోన కుమిలిపోతున్నారా? సునాయాసంగా గెలవాల్సిన మోడీ సొంత రాష్ట్రంలో పేలవమైన ఫలితాలు రాబట్టడంపై కమలనాధులేమనుకుంటున్నారు?

తెలంగాణలోనూ పాగా వేయాలని మోదీ-షా వ్యూహాలు

Submitted by arun on Mon, 12/18/2017 - 16:22

వరుస విజయాల నరేంద్ర మోదీ, సౌత్‌లో తొలిగడప తెలంగాణపై గురిపెట్టబోతున్నాడా గుజరాత్‌, హిమాచల్‌ జోష్‌తో ఇక తెలంగాణలో సైతం పాగా వేసేందుకు సిద్దమవుతున్నాడా తెలంగాణ సాధనలో తమ పార్టిదీ కీలకమైన పాత్రంటున్న మోదీ, ఇక్కడా నార్త్‌ ఫార్ములా వర్కవుట్ చేద్దామనుకుంటున్నారా వర్కవుట్ అవుతుందా?