narendra modi

మోడీని ఢీకొట్టేందుకు రాహుల్‌‌‌లో ఈ మార్పు సరిపోతుందా?

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:42


రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించి, విశ్రాంతి తీసుకోవాలని, సోనియా గాంధీ 2014 నుంచి అనుకుంటూనే ఉన్నారు. కానీ ముళ్లకిరీటంలా భావించి తప్పించుకు తిరిగారు రాహుల్‌.ఎవరికీ చెప్పకుండా, వేరే దేశాలకు వెళ్లేవారు. కానీ ఏమైందో ఏమో కానీ, 2017 డిసెంబర్‌ 16న బలవంతంగానో, బతిమాలో రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షున్ని చేశారు. ఇష్టంలేకుండా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌, పార్టీని ప్రక్షాళన చేయడం మాత్రం మొదలుపెట్టారు.

మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు మాయం: రాహుల్

Submitted by chandram on Fri, 12/07/2018 - 17:11

ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన ఏకంగా స్ట్రాంగ్ రూమ్ నుంచే ఈవీఎంలు గల్లంతైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక కొన్ని ఈవీఎంలు అయితే హోటల్లో ఛాయ్ తాగుతూ కనిపించాయని మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం విసిరారు. భారతప్రధాని నరేంద్రమోడీ ఇండియాలో ఈవీఎంల దుస్థితి ఇలా దపరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్ట్రాంగ్ రూంల వద్ద రక్షణ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.

తెలంగాణ ఎన్నికలపై మోదీ తెలుగులో ట్వీట్‌

Submitted by arun on Fri, 12/07/2018 - 10:29

ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవాళ ఎన్నికల రోజని, తెలంగాణలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

నేడు రాష్ట్రానికి మోడీ, రాహుల్‌

Submitted by chandram on Mon, 12/03/2018 - 11:29

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సభ నిర్వహణను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నారు. ఆయన గద్వాల, తాండూరు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లిలో రోడ్‌షోలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, రాహుల్‌ మరోసారి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, రహ్మత్‌నగర్‌, మూసాపేట సభల్లో పాల్గొంటారు.

సీఎం కేసీఆర్‌‌ది కాంగ్రెస్ స్కూలే...కాంగ్రెస్‌లోనే ఓనమాలు దిద్దారు..ఆ పార్టీలోనే పీహె‌చ్‌డీ చేశారు

Submitted by arun on Tue, 11/27/2018 - 15:58

కేసీఆర్‌ ది కాంగ్రెస్ స్కూలేనని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోనే కేసీఆర్ ఓనమాలు దిద్దారన్న మోడీ..హస్తం పార్టీలోనే పీహె‌చ్‌డీ కూడా చేశారని నిజామాబాద్ సభలో అన్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్‌ తెలంగాణను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. కేసీఆర్ కాంగ్రెస్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపించారు మోడీ. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే యూపీఏ సర్కారులో కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారని తెలిపారు. కేసీఆర్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే నమ్మవద్దని చెప్పారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నిం చేస్తున్నాయని విమర్శించారు. 

కేసీఆర్ లండన్ వెళ్ళి... వచ్చే ఐదేళ్ళు అక్కడే ఉండాలి : మోడీ

Submitted by arun on Tue, 11/27/2018 - 14:34

నిజామాబా‌ద్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని మోడీ ప్రశ్నించారు. కేసీఆర్ హామీ ఎంతవరకు నిజమైందోనని హెలీకాఫ్టర్‌ నుంచి గమనిస్తే నిజామాబాద్ లో కరెంటు, నీరు, రోడ్ల సమస్యలు అలానే ఉన్నట్లు తేలిందని మోడీ చెప్పారు. అసలు లండన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కేసీఆర్  ఇంగ్లండ్ వెళ్ళి... వచ్చే ఐదేళ్ళు అక్కడే గడపాలని సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలన కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి రహితంగా సాగుతోందని మోడీ అన్నారు.

కేసీఆర్ పూజలపై మోదీ షాకింగ్ కామెంట్స్...

Submitted by arun on Tue, 11/27/2018 - 13:59

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగానికి శ్రీకారం చుట్టారు. అమరవీరుల కల సాకారం చేసిన తెలంగాణకు వందనమంటూ నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలుగులో ప్రసంగించారు. రజాకార్లను ధైర్యంగా ఎదురించిన నేల తెలంగాణ అన్న మోడీ మూడు నదులు ప్రవహించే పుణ్య భూమి తెలంగాణ అని కొనియాడారు. నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పాలన కాంగ్రెస్ తరహాలోనే అభివృద్ధి రహితంగా సాగుతోందని మోడీ అన్నారు.

కాసేపట్లో తెలంగాణలో మోడీ పర్యటన

Submitted by arun on Tue, 11/27/2018 - 10:27

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచార సభల్లో తొలిసారి పాల్గొనబోతున్నారు. ఇవాళ నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌‌లలో జరిగే బహిరంగ సభలకు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో మోడీ పాల్గొంటారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. నిజామాబాద్‌ సభ తర్వాత మోడీ మహబూబ్‌ నగర్‌ వెళ్ళి ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. 

తన తల్లిదండ్రులను రాజకీయాల్లోకి లాగడంపై మోదీ ఆవేదన

Submitted by arun on Mon, 11/26/2018 - 10:32

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాటల తూటాలు పేల్చారు. తన కటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతున్న వారిపై పంచ్ డైలాగులు విసురుతూనే ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. రుణమాఫీ హామీతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న రాహుల్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. దేశ వ్యాప్తంగా కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ను రాష్ట్రం నుంచి శాశ్వతంగా సాగనంపాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో ప్రధాని మోడీ, అమిత్ షా

Submitted by arun on Thu, 11/22/2018 - 10:44

తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ప్రచార బరిలో దిగనున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని కమలనాథులు మరింత వేడేక్కించనున్నారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ తరపున  ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 27న ఉదయం నిజామాబాద్‌లో సభ, మధ్యాహ్నం వరంగల్‌లో బహిరంగ సభల్లో మోడీ ప్రసగించనున్నారు. డిసెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో  మోదీ పాల్గొంటారు.