Rajath Kumar

ఎన్నికలకు సర్వం సిద్ధం: రజత్ కుమార్

Submitted by chandram on Thu, 12/06/2018 - 19:25

తెలంగాణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం 32 వేల 815 పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చని ఇప్పటికే 100 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ జరుగుతుందని మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని.. రజత్‌కుమార్‌ తెలిపారు.

4లక్షల 93వేల బోగస్ ఓట్లు తొలగింపు: రజత్ కుమార్

Submitted by chandram on Tue, 12/04/2018 - 11:08

లంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. 4లక్షల 93వేల బోగస్ ఓట్లు తొలగించామని చెప్పారు. నెలరోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేశామని వివరించారు. న్యాయపరమైన సమస్యలను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామన్న ఆయన ఎన్నికల నిర్వహణ ఒక సవాల్‌ లాంటిదన్నారు.  7వ తేదీన జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు.  4లక్షల 93వేల బోగస్ ఓట్లు,  2లక్షలకు పైగా డబుల్ పేర్లు ఓట్లు,  3లక్షలకు పైగా చనిపోయిన వారి ఓట్లు తొలగించామని మీట్ ది ప్రెస్ లో తెలిపారు. 

ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేక కసరత్తు

Submitted by chandram on Sun, 12/02/2018 - 11:21

తెలంగాణ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు బూత్‌ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనే వార్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. క్షణం క్షణం అప్‌డేట్స్‌తో పాటు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు వార్‌ రూమ్‌ సిద్ధంగా ఉంటోంది. ఎన్నికల ప్రక్రియ అంటే అదో సుదీర్ఘ ప్రహసనం. నోటిఫికేషన్‌ మొదలు నుంచి కౌంటింగ్ వరకు తలకుమించిన భారాలెన్నో.

డిసెంబర్ 7న సెలవు: రజత్‌కుమార్

Submitted by chandram on Fri, 11/30/2018 - 14:56

తెలంగాణలో వచ్చేనెల డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో డిసెంబర్ 7న మాత్రం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సంయుక్త ముఖ్యఎన్నికల అధికారి ఆమ్రపాలితో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకొవాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపీణీ శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. అలాగే ‘నా ఓటు యాప్‌’ను రజత్ కుమార్ విడుదల చేశారు.

మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు: సీఈవో రజత్ కుమార్

Submitted by chandram on Tue, 11/20/2018 - 18:33

తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకొని ఓటింగ్ శాతం పెంచడంమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రఎన్నికల ప్రధానధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ స్లీప్ పంపీణీ మొదలు పెట్టి కుటుంబసభ్యులకే ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల పెంపు, మార్పునకు విజ్ఞప్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 32వేల 796 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సర్వీస్ ఓటర్లు 9వేల 445 మంది. లక్షా 60వేల 509 మంది పోలింగ్ సిబ్బందిని అవసరమవుతారని తెలిపారు. పోలింగ్ రోజు 30వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తమని  తెలిపారు. కాగా తెలంగాణలో మొత్తం 3వేల 538 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు

Submitted by arun on Fri, 11/16/2018 - 13:58

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ రజత్ కుమార్. నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికార పార్టీ నాయకులపై కూడా ఫిర్యాదు వస్తే కేసులు పెడుతున్నామని తెలిపారు. పోలింగ్ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తారని తెలిపారు. సిటీలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని అన్నారు. సుందరయ్య విజ్నాన కేంద్రంలో రజత్ కుమార్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. 

కేసీఆర్‌ ఇప్పుడు అభ్యర్థి మాత్రమే: సీఈవో

Submitted by arun on Tue, 11/13/2018 - 12:01

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలుకు గుడువుంది. నోటిషికేషన్‌ జారీ కావడంతో నిబంధనలను ఎన్నికల సంఘం మరింత కఠినతరం చేసింది. అభ్యర్థులపై నిఘా పెంచడంతో పాటు మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలంగాణ సీఈవో రజత్ కుమార్ ప్రకటించారు. ప్రచారం చేసే అభ్యర్ధులు ప్రతి రోజూ ఖర్చుల వివరాలు తెలియజేయాల్సిందేనన్నారు. ప్రతి అభ్యర్ధిపై నిఘా వేసినట్టు ఆయన తెలిపారు.

ఎన్నికల సిబ్బందిని విధులకు రంగం సిద్దం చేస్తున్నఈసీ

Submitted by arun on Fri, 11/02/2018 - 12:54

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సిబ్బంది నియామకంపై ఈసీ దృష్టిపెట్టింది. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కోసం ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు సిబ్బందిని నియమిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎన్నికల సంఘం నియమించే సిబ్బంది తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల డ్యూటి  చేయాల్సి ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ నిజమే..చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్‌!

Submitted by arun on Tue, 10/30/2018 - 11:08

తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని తేలింది. అయితే జాతీయ భద్రత, నేరాల నిర్మూలన కోసమే కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్‌ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల సంఘానికి డీజీపీ వివరణ ఇచ్చారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.