janasena

సిగ్గు! సిగ్గు!!

Submitted by lakshman on Sat, 02/17/2018 - 00:51

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క్రిటిక్ క‌త్తిమ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నినిధులు కేటాయించింది అనే విష‌యంపై ప‌వ‌న్ నిజ‌నిర్ధార‌ణ కోసం  జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జె.ఎఫ్.సి) కమిటీని  ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీ శుక్ర‌వారం భేటీ అయి ప‌లు అంశాల‌పై చ‌ర్చించింది. 

ప‌వ‌న్ ను మెచ్చుకున్న చంద్ర‌బాబు

Submitted by arun on Thu, 02/15/2018 - 13:37

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం జరిగిన టీడీపీ నేతల సమన్వయ కమిటీలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ జేఏసీపై స్పందించారు. పవన్ కల్యాణ్‌ పోరాటంలో అర్థం ఉందని సమావేశంలో పాల్గొన్న నేతలతో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మేలు చేయాలనే కాంక్షతో పవన్ ముందుకెళ్తున్నారని సీఎం మెచ్చుకున్నారు. 

ఇద్దరి మ‌ధ్య పొత్తు షురూ..?

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:10

ఏపీ లో ఎన్నికల సందడి అప్పుడే మొదలయ్యిపోయింది..ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి..ఎన్ని సీట్లు అడగాలి ఇలా ఎవరి అంచానాలు వారికి ఉన్నాయి అయితే టిడిపి –జనసేన పొత్తు ఉంటుంది ముందు నుంచీ భావిస్తున్న తరుణంలో..ఇద్దరి పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి..అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపి ని ఈ సారి చంద్రబాబు దూరం పెట్టారనే చెప్పాలి…వచ్చే ఎన్నికల్లో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు..

‘చెల్లెలు కవిత గారికి థాంక్యూ’: పవన్‌కల్యాణ్‌

Submitted by arun on Sat, 02/10/2018 - 10:40

టీఆర్ఎస్ ఎంపీ కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన గళమెత్తిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా దీని గురించి లోక్‌సభలో మాట్లాడారు. ఆంధ్రాకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా హామీల విషయంపై కేంద్రం మళ్లీ పాతమాటే చెబుతుండటంతో ఆంధ్రా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సత్తా జేపీతో పవన్ భేటీ

Submitted by arun on Thu, 02/08/2018 - 15:40

జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌... లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణతో భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ ఏర్పాటుపై జేపీతో మంతనాలు జరిపారు. విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నాలపై పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తాను జయప్రకాశ్ నారాయణతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా గురించే పవన్ ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పలువురు నేతలతో కలిసి పవన్ కల్యాణ్ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ పోరాట‌మే నాకు స్పూర్తి

Submitted by lakshman on Thu, 02/08/2018 - 02:57

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్ర, రాష్ట్రాల‌ తీరును త‌ప్పుప‌ట్టారు. ఏపీ ప్ర‌జ‌ల్ని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీలు మోసం చేశాయ‌ని సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం తాను పోరాటం చేసిన‌ప్పుడ‌ల్లా బీజేపీ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని సూచించారు. కాబ‌ట్టే విభ‌జ‌న చ‌ట్టంలో హామీలు నెర‌వేర్చేలా కేంద్రం మొడ‌లు వంచాలి.  తాను కేంద్రంపై  చేసే పోరాటం ఒక్క‌టే స‌రిపోదు. మీ అంద‌రి మ‌ద్ద‌తు కావాలి.  తెలంగాణ ఉద్య‌మ స్పూర్తి తో పార్టీలక‌తీతంగా పోరాటం చేయాలి. అందుకు త‌గ్గ భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.

జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ?

Submitted by arun on Wed, 02/07/2018 - 15:41

ప్రశ్నిస్తా...ప్రశ్నిస్తా.. అన్న జనసేనాని ఎక్కడ? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకొన్న వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడు? కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగినా ఎందుకు అజ్ఞాతవాసి అయ్యాడు? ప్రశ్నిస్తే కేంద్రం తన పవర్ కట్ చేస్తుందన్న భయమా? లేక దీని వెనుక ఏదైనా దీర్ఘకాల వ్యూహం ఉందా? ప్రశ్నించాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించకపోవడంపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.

కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన జనసేన అధినేత

Submitted by arun on Mon, 02/05/2018 - 18:11

కేంద్ర బడ్జెట్‌పై జనసేన అధినేత పవన్‌ స్పందించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలకు పార్టీలు జవాబుదారీగా ఉండాలని పవన్‌ అన్నారు. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని పవన్‌ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులతో సమావేశమైన పవన్‌ జనసేన అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. 

అజ్ఞాతంలో ప‌వ‌న్ క‌ల్యాణ్

Submitted by arun on Sat, 02/03/2018 - 10:55

అజ్ఞాతవాసి పవన్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? కేంద్ర బడ్జెట్ పై అన్ని పార్టీలు మండిపడుతుంటే పవర్ స్టార్ ఎక్కడ?  బడ్జెట్ వచ్చి రెండు రోజులు గడిచిపోయినా.. పవన్ స్పందన మాత్రం కరువైంది.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న జనసేన ఎన్నికల ముంగిట్లో ఇంత నిర్లిప్తంగా ఉండటానికి కారణాలేంటి?