'Mayabazar'

వివాహ భోజనంబు వింతైన వంటకంబు!

Submitted by arun on Thu, 12/06/2018 - 12:33

మంచి భోజనం తినటం అనగానే గుర్తుకు వచ్చే పాట...వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే ఈ పాట.  ఈ పాట  1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం మాయాబజార్లో పాట. ఈ పాటను పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్ (1957) సినిమా కోసం రచించారు. ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడగా, ఘంటసాల వెంకటేశ్వరరావుసంగీతాన్ని అందించారు. చాయాగ్రాయకుడు మార్కస్ బార్ట్లే సినిమాలో ఈ పాటను వంటశాలలో ఎస్వీ రంగారావు పై చిత్రీకరించారు. ఈ పాటలో తెలుగువారి పెళ్ళి భోజనాలలోని వంటకాలను పేర్కొన్నారు. గారెలు, బూరెలు, అరిశెలు, లడ్డులు, అప్పడాలు, ధప్పడాలు, పాయసాలు మున్నగు వంటలను చూపించారు కూడా. ఈ పాట విన్నా...చూసిన కూడా ఆకలి వేసేస్తుంది.

కె వి రెడ్డి మరియు విజయా సంస్థ

Submitted by arun on Wed, 10/17/2018 - 12:46

కొన్ని కాంబినేషన్లో గొప్ప సినిమాలు వస్తాయి.. అలాగే..  జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ మరియు గొప్ప దర్శకుడు కె వి రెడ్డిగారు కాంబినేషన్లో వచ్చిన ఒక అద్బుతమైన సినిమా ... మాయాబజార్.  వీరి కాంబినేషన్ ఎన్నో దశాబ్దాలు నిలిచి పోయింది..  అలాగే వీరు ఇద్దరు.. వేరు వేరు గా కూడా మంచి సినిమాలు అందించారు.. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథలాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకి ఎన్నో అపురూప కళాఖండం అందించింది.. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు ఎన్నో గొప్ప చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి . శ్రీ.కో.