High Court of Hyderabad

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా

Submitted by chandram on Fri, 12/14/2018 - 20:05

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టుకు కేంద్రం నివేదిక సమర్పించింది. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి వ్యవహారంపై CISF అందజేసిన నివేదికను కేంద్రం హైకోర్టుకు నివేదించింది. విచారణ సందర్భంగా సీల్డ్‌ కవర్‌లోని నివేదికను పరిశీలించిన న్యాయస్ధానం  అసమగ్రంగా ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో మరోసారి నివేదికను సమర్పించాలంటూ ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా చేసింది.

ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

Submitted by chandram on Mon, 12/03/2018 - 16:33

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 5కి వాయిదా వేసింది.

తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 10/12/2018 - 16:04

తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ నేత డీకె. అరుణతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.