STAR CAMPAINGNER BALAYYA

అన్నగారి రూపు... ఊపు తెస్తుందా... బాలయ్యే క్యాంపెయినరా?

Submitted by santosh on Fri, 10/12/2018 - 10:42

ఎన్నికల వేళ మరోసారి ఎన్టీఆర్‌నే నమ్ముకుంది టీటీడీపీ. అన్నగారిని ఎన్నికల ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. తెలంగాణలో తారక రామునికి అభిమానాలు లెక్కకు మిక్కిలిగా ఉండటం..ఓ సామాజిక వర్గ ఓటర్లు ఎన్టీఆర్‌కు వీరాభిమానులుగా ఉండటంతో, అది తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న బాలకృష్ణను, అన్నగారి గెటప్‌లోనే ఎన్నికల రణక్షేత్రంలోకి దింపాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం.