TARGET POLITCIS

టార్గెట్‌ పాలిటిక్స్... ఎంపీ ఔర్‌ ఎమ్మెల్యే!!

Submitted by santosh on Fri, 10/12/2018 - 10:38

రాజకీయ పార్టీల్లో కార్యకర్త అయినా, ఓ మోస్తరు నేతయినా, చివరికి వారి లక్ష్యం ప్రజాప్రతినిధి కావడం. అందులోనూ ఎంపీ లేదా ఎమ్మెల్యే టార్గెట్. అందుకోసం పార్టీకి రేయింబవళ్లు పని చేస్తారు. పోస్టర్లు అతికించడం, జెండాలు మోయడం, మీటింగ్‌లు అరెంజ్ చేయడం, పార్టీలో కార్యకర్త నుంచి కీలక పదవులకు చేరడం, చివరిక ప్రజాప్రతినిధిగా నిలబడేందుకు పార్టీ టికెట్‌ దక్కడం. చివరికి వీరి అంతిమ లక్ష్యం ప్రజాప్రతినిధి. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులకైతే, ఇక తర్వాత తమకు ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని గంపెడాశలో ఉంటారు. అయితే, చాలా పార్టీల్లో, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి సైతం ఈసారి కూడా టికెట్‌ దక్కే ఛాన్స్ కనపడ్డం లేదు.