election candidates

నిరసనలు.. నీరాజనాలు.. హామీలు... అవమానాలు!!

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:27

హామీలు మరిచిన నేతలకు, జనాల నిరసన సెగలు ఇప్పటి వరకూ చూశాం. వాగ్దానాలకు ఆచరణరూపమిచ్చి కొందరు అరుదైన నాయకులకు, వీరాభిషేకాలు ఇప్పుడు చూడబోతున్నాం. ఊరికిచ్చిన మాటలు నెరవేర్చి, చేసిన బాసలను కళ్లముందు చూపించిన లీడర్లకు, జనం నీరాజనం పలుకుతున్నారు. చేసిన మేళ్లను మరచిపోలేమంటూ సన్మానాలు చేస్తున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే, అదిగో తమ మనసు గెలిచిన నాయకుడు వచ్చాడంటూ వీరతిలకాలు దిద్దుతున్నారు జనం. సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, హరీష్‌కు స్వాగతమే లభిస్తోంది. ఇబ్రహీంపూర్‌ గ్రామ ప్రజలు బతుకమ్మలతో ఆహ్వానించారు. మీకే ఓటేస్తామంటూ ప్రతిజ్ణ చేశారు.