Quthbullapur

రాహుల్ అనుచరుడు కావాలా...మోడీ జీతగాడు కావాలా..?

Submitted by arun on Mon, 10/08/2018 - 10:29

మోడీ జీతగాడు రాష్ట్రాన్ని పాలించాలా.. లేక, రాహుల్ అనుచరుడు పాలించాలో ప్రజలే ఆలోచించాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆదివారం కుత్బుల్లాపూర్ లో జరిగిన మైనార్టీ సభలో పాల్గొన్న రేవంత్ మోడీని ఓడించాలంటే, ముందు టీఆర్ఎస్ ను ఓడించాలన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రతి ఇంట్లో ఒకరు యుద్దానికి సిద్ధమవ్వాలన్నారు రేవంత్. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు పేరుని తెరమీదకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పీడవిరగడ అవ్వడానికే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.