2018 elections

ఇవాళ కారు జోరు ఉండొచ్చు.. రేపు రిపేర్ కావొచ్చు: పొన్నం

Submitted by chandram on Sat, 12/15/2018 - 14:12


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎప్పడైనా ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దిగులు చెందోద్దని ప్రభాకర్ అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరు ఉండొచ్చని రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ తోకపార్టీ అని మండిపడ్డారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు.  

కేవ‌లం 3 ఓట్ల తేడాతో..

Submitted by chandram on Thu, 12/13/2018 - 17:35

తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్ధి కేవలం మూడంటే మూడే ఓట్ల తేడాతో విజయం తన సొంతం చేసుకున్నారు. మిజోరం నేష‌న‌ల్ ఫ్రంట్‌కు చెందిన లాల్‌చంద‌మా ర‌త్లే తువ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు జెండా ఎగరవేశారు. కేవ‌లం మూడు ఓట్ల తేడాతో నెగ్గడమే విశేషం. లాల్‌చంద‌మాకు 5207 ఓట్లు పోల‌వ్వగా, ఆయ‌న ప్రత్యర్థి ఆర్ఎల్ ప‌న్వామియాకు 5204 ఓట్లు పోల‌య్యాయి.

బీజేపీ నుంచి ఒకే ఒక్కడుగా రాజాసింగ్...

Submitted by chandram on Tue, 12/11/2018 - 21:24

తెలంగాణలో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది. హేమాహేమీలు సైతం ఓటమి చవిచూశారు. కొందరు నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీజేపీ జాతీయ నేతలు ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. భారతీయ జనతాపార్టీ తెలంగాణలో 119 స్థానాల్లో 118 స్థానాల్లో పోటీ చేసింది. యువ తెలంగాణ పార్టీకి ఒక సీటు కేటాయించింది. పోటీ చేసిన 118 స్థానాల్లో ఒకేలం గోషా మహల్ సీటును మాత్రమే దక్కించుకుంది. రాజాసింగ్ మాత్రమే ప్రత్యర్ధులను తట్టుకుని విజయం సాధించారు. ముషీరాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమి చవిచూశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు.

ఢిల్లీ చేరిన కాంగ్రెస్ రాజకీయం.. ప్రారంభమైన నేతల లాబీయింగ్

Submitted by chandram on Sat, 12/08/2018 - 14:46

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయం నువ్వా, నేనా అనే రీతిలో సాగింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే విషయం తెలియ చేశాయి. ఇక సీఎం పదవి కోసం ఇటు అశోక్ గెహ్లాట్ ఇటు సచిన్ పైలట్ హోరాహోరిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పడికే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంతనాలు జరిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌లో ఈవీఎంలు మాయం: రాహుల్

Submitted by chandram on Fri, 12/07/2018 - 17:11

ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన ఏకంగా స్ట్రాంగ్ రూమ్ నుంచే ఈవీఎంలు గల్లంతైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక కొన్ని ఈవీఎంలు అయితే హోటల్లో ఛాయ్ తాగుతూ కనిపించాయని మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం విసిరారు. భారతప్రధాని నరేంద్రమోడీ ఇండియాలో ఈవీఎంల దుస్థితి ఇలా దపరించిందని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్ట్రాంగ్ రూంల వద్ద రక్షణ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.

గల్ఫ్‌ ఓటర్లపై రాజకీయ పార్టీల డేగ కన్ను.. కార్మికుల ఓట్ల వర్షం ఎవరిపై కురుస్తుందో.?

Submitted by santosh on Mon, 11/26/2018 - 18:14

గల్ఫ్‌ కార్మికుల ఓటు బ్యాంకు, పొలిటికల్‌ పార్టీల్లో దడ పుట్టిస్తోంది. దశాబ్దాలుగా చేసిన హామీలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా, మరోసారి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నాయి పార్టీలు. దాదాపు 26 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు, నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ గల్ఫ్‌ ఓట్ల కోసం పార్టీల పయనం ఎలా ఉంది. ఏయే జిల్లాల్లో నిర్ణయాత్మక ఓటుగా గల్ఫ్‌ ఫ్యామిలీలున్నాయి.

నేను చచ్చేలోపు రైతులు ధనవంతులు కావాలి: కేసీఆర్‌

Submitted by chandram on Mon, 11/26/2018 - 14:51

నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ తాను చనిపోయేలోపు తెలంగాణలో ఉన్న అందరూ రైతులు ధనవంతులు కావాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇష్టమోచ్చినట్లు అరవడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని కెసిఆర్ విమర్శించారు. ఎన్నికల అంటేనే మాటల గారడి ఎవరో వచ్చి ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెబుతారు అయినా మీరు ఆగం కావద్దని కెసిఆర్ ప్రజలకు సూచించారు. ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటుండు కాని వచ్చే సంవత్సరం అసలు ఆయన అధికారంలో ఉంటే కదా అని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

బాడీ బిల్డర్లతో ధూం ధాం ప్రచారం.. ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌

Submitted by santosh on Mon, 11/26/2018 - 12:51

హడావుడికి తక్కువేం ఉండదు. హంగామాకు కొదువే కనిపించదు. చుట్టూ ఎవరూ లేకున్నా. పర్ఫార్మెన్స్‌ లో మాత్రం ఫస్ట్‌ క్లాస్‌ కొట్టేస్తారు. ప్రజల్లోకి వెళ్లే సమయంలో తమ బలం, బలగం చూపించే వేదికగా ఎన్నికలనుకునే నాయకులు.. మనదేశంలో చాలామందే ఉన్నారు. కనీసం ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లెలా అడగాలో కూడా తెలియని లీడర్లు అడుగడుగునా కనిపిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో అచ్చం అలాగే కనిపిస్తున్నారు కొందరు లీడర్లు. 

టీఆర్‌ఎస్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Submitted by chandram on Sun, 11/25/2018 - 18:02

ఇటివలే  టీఆర్ఎస్ పార్టీకి గుడై బై చెప్పి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్న చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వేర్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అసంతృప్తిలో ఉన్నారని, జితేందర్‌ రెడ్డి, కేశవరావు వంటి కీలక నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని వెల్లడించారు. తాజాగా ఆర్బీఐ కూడా తెలంగాణను కెసిఆర్ అప్పుల ఊబిలో పడేసారని స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఒకప్పుడు జైతెలంగాణ అన్న నాయకులుంతా నేడు జై కెసిఆర్, కెటిఆర్ అంటున్నారని ఎద్దేవ చేశారు.

ముందస్తు ఎన్నికలు కేవలం కెసిఆర్ కుటుంబంకోసమే: అమిత్ షా

Submitted by chandram on Sun, 11/25/2018 - 16:39

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, బీసీ కమిషన్‌కు మోడీ చట్టబద్ధత కల్పించారని ఆయన కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి భారీగా నిధులు మంజూరు చేసారని వెల్లడించారు. పేదల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ తెస్తే కేసీఆర్ తెలంగాణలో అమలు చేయలేదన్నారు.