Andhrapradesh

సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల సెగ!

Submitted by arun on Wed, 01/17/2018 - 17:30

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు మత్స్యకారుల సెగ తగిలింది. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నోవాటెల్‌ హోటల్‌కు రానున్న నేపథ్యంలో హోటల్‌ దగ్గర మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హోటల్‌కు ఎదురుగా ఉన్న సముద్రంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున జలదీక్ష చేపట్టారు. తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ మత్స్యకారులు గతకొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దీక్ష చేపట్టారు మత్స్యకారులు.
 

వైసీపీకి మరో షాక్...త్వరలోనే పార్టీ మారనున్న కీలక నేత

Submitted by arun on Wed, 01/17/2018 - 12:07

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఇక సెకండరీ కేడర్ కూడా పెద్దఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆ పార్టీకి మరిన్ని దెబ్బలు తప్పేలా లేవు. ఇందుకు తాజా ఉదాహరణ వంగవీటి రాధా. పార్టీ పటిష్టత, అధికారమే లక్ష్యంగా ఆపార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా... ఒక్కోక్కరుగా నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ... తాజాగా మరో మాజీ ఎమ్మెల్యేను కూడా కోల్పోనుంది.

సబ్బవరంలో దారుణం..సొంత తమ్ముడి భార్యపై ఇద్దరు అన్నదమ్ములు దాడి

Submitted by arun on Wed, 01/17/2018 - 11:55

విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన ఆ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సొంత తమ్ముడి భార్యనే ఇద్దరు అన్నదమ్ములు చావబాదారు. కాళ్లతో ఇష్టానుసారంగా తంతూ, చెతులతో పిడిగుద్దులు గుద్దుతూ పైశాచికంగా హింసించారు. సాటి మహిళ అయి కూడా అత్త.. బాధితురాలి పట్ల ఎలాంటి జాలి చూపలేదు సరికదా, తానూ ఓ చేయి వేస్తాను అన్నట్లు కర్రతో దాడి చేసింది.

నారావారిపల్లెలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా దేవాన్ష్‌

Submitted by arun on Wed, 01/17/2018 - 11:12

నారావారి పల్లిలో ఏటా జరిగే సంక్రాంతి సంబరాల్లో ఈసారి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ దేవాన్ష్‌. ఇద్దరు తాతల ముద్దుల మనవడిగా దేవాన్ష్‌.. పల్లె వాసుల హృదయాలను చూరగొన్నాడు. ముద్దులొలికే ముఖ్యమంత్రి మనవడిని చూసి నారావారిపల్లె మురిసిపోయింది. నారావారిపల్లెలో నారా-నందమూరి కుటుంబాల సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కనుమ సందర్భంగా నారా వారి ఇంటిలో రకరకాల 
వంటలు ఘుమఘుమలాడాయి.

కేసీఆర్‌ క్రేజ్‌..ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ

Submitted by arun on Wed, 01/17/2018 - 10:40

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‌రావుకి ఆంధ్రప్రదేశ్‌లో అభిమానులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. సందర్భం ఏదైనాసరే కేసీఆర్‌‌‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫ్లెక్సీల రూపంలో తమ మనసులో ఉన్న ఇష్టాన్ని, ఆయన పరిపాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక యాదవులైతే కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
 

నేడు ఏపీలో 16 ఐటీ కంపెనీలు ప్రారంభం

Submitted by lakshman on Wed, 01/17/2018 - 09:01

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉద్యోగాలే ల‌క్ష్యంగా కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో రాజధాని ప్రాంతం మంగళగిరిని మైటెక్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న ఐటీ మంత్రి నారాలోకేష్ నేడు 16ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నారు. 
ఈ కంపెనీల ద్వారా ఇప్పటికిప్పుడు 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా ఏడాదిలోపు మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా వీటిలో 500 మంది పనిచేస్తున్నారు. 

గేటు దూకిన హీరో సూర్య

Submitted by arun on Mon, 01/15/2018 - 15:05

కోలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌.... హీరో సూర్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో హల్‌చల్‌ చేశారు. స్థానిక మేనక థియేటర్‌లో గ్యాంగ్‌ సినిమా షోలో ప్రేక్షకులను పలకరించారు. సూర్యని చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. అయితే థియేటర్‌ బయట జనం భారీగా తరలిరావడంతో... సూర్య వెనుక గేటు దూకి వెళ్లారు.
 

ఆల్‌ ది బెస్ట్‌ .. జగన్‌ అన్నా: సూర్య

Submitted by arun on Mon, 01/15/2018 - 12:44

ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్, చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు, ప్రముఖ తమిళ నటుడు సూర్య నుంచి అనూహ్య మద్దతు లభించింది. "ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన,  ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన వ్యాఖ్యానించాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైఎస్‌ఆర్‌ కుటుంబంతో పరిచయం ఉందని సూర్య చెప్పారు. వైఎస్‌ జగన్‌, తాను కలుసుకొని మాట్లాడినప్పుడు రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని.. అయినా ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైఎస్‌ జగన్‌ లో గమనించానని సూర్య అన్నారు.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Submitted by arun on Mon, 01/15/2018 - 12:22

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్‌ వద్ద ఆయన పండుగ వేడుకల్లో ఉత్సాహంగ పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వైఎస్‌ జగన్‌.. పంచె, కండువా ధరించారు. పారకాల్వలో  వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ప్రజలకు జగన్ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. 

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు

Submitted by arun on Mon, 01/15/2018 - 12:15

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు  కోడింపందాలు  కొనసాగుతుండగా మరోవైపు రికార్డింగ్ డ్యాన్సులకు తెరలేచింది. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు మొదలాయ్యాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలంలోని శంకరగుప్తం, తూర్పుపాలెం, మగటపల్లి, కేశనపల్లి, సఖినేటిపల్లి, కరవాక గ్రామాలలో అశ్లీల నృత్యాలు చేశారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.