KKR VS PBKS: ఐపీఎల్ లో కోల్‌కతాపై పంజాబ్ విజయం

Punjab Won Against Kolkata In IPL
x

KKR VS PBKS: ఐపీఎల్ లో కోల్‌కతాపై పంజాబ్ విజయం

Highlights

KKR VS PBKS: కోల్‌కతాను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్

KKR VS PBKS: ఐపీఎల్-17వ సీజన్ లో రోజు రోజుకు రికార్డులు బద్దలై పోతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడ్స్ తో జరిగిన మ్యాచ్ లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన పంజాబ్.. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ 20ల్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. 262 పరుగుల భారీ టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది.

పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు. శాశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 నాటౌట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఆరు వికెట్లకు 261 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడ్స్ బ్యాట్స్‌మెన్‌లు ఫిల్ సాల్ట్ 75, సునీల్ నరైన్ 71 పరుగులతో చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్ 39, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగలతో రాణించారు. బెయిర్ స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సునీల్ నరైన్​ ఓ వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటింగ్​ చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్​లో బ్యాట‌ర్లు మ‌రోసారి తన సత్తా చాటారు. సొంత‌మైదానంలో త‌మ బ్యాట్ల‌కు ప‌ని చెప్పి పంజాబ్ కింగ్స్ బౌలర్ల‌పై విరుచుకుపడ్డారు. దీంతో కోల్‌క‌తా 6 వికెట్ల న‌ష్టానికి 261 పరుగుల భారీ స్కోర్​ చేసింది. ఓపెన‌ర్లు ఫిలిప్ సాల్ట్(75), సునీల్ న‌రైన్(71) అదిరో ఆరంభాన్ని ఇచ్చారు. హాఫ్​ సెంచరీలతో చెల‌రేగారు. వీరి దెబ్బకు 8 ఓవ‌ర్ల‌కే స్కోర్ 100 దాటింది. అయితే బౌండ‌రీలు బాదుతూ తోసెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్లిన న‌రైన్‌ను రాహుల్ చాహ‌ర్ ఔట్ చేశాడు. దీంతో 138 ప‌రుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్​. రసెల్​(24) ఫర్వాలేదనిపించాడు. చివ‌ర్లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(28) దూకుడుగా ఆడాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్​తో(39 నాటౌట్) క‌లిసి బౌండ‌రీలు బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. రింకూ సింగ్(5), రమన్​ దీప్ సింగ్(6 నాటౌట్) స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ శామ్ కరన్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories