అభినందన్ సెకండ్ ఇన్నింగ్స్..రావడం రావడమే మిగ్‌ 21 నడిపి రికార్డు

అభినందన్ సెకండ్ ఇన్నింగ్స్..రావడం రావడమే మిగ్‌ 21 నడిపి రికార్డు
x
Highlights

అత్యాధునిక ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి భారతీయుల సత్తాను పాకిస్తాన్‌కు రుచి చూపించిన వింగ్ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ తిరిగి విధుల్లోకి చేరారు....

అత్యాధునిక ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి భారతీయుల సత్తాను పాకిస్తాన్‌కు రుచి చూపించిన వింగ్ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ తిరిగి విధుల్లోకి చేరారు. రావడం రావడమే మిగ్‌ 21 యుద్ధ విమానాన్ని నడిపి సంచలనం సృష్టించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్‌ 21లో చక్కర్లు కొట్టిన అభినందన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అత్యాధునిక ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చి 130కోట్ల మంది భారతీయుల సత్తాను పాకిస్తాన్‌కు రుచి చూపించిన వింగ్ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ తిరిగి విధుల్లోకి చేరారు. రావడం రావడమే పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో మిగ్‌ 21 విమానం నడిపి మళ్లీ వార్తల్లో నిలిచారు.

పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై భారత జరిపిన ఎయిర్‌ స్ట్రైక్‌‌లో వింగ్ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. భారత గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఎఫ్‌-16 అత్యాధునిక యుద్ధ విమానాన్ని నేలకూల్చాడు. అయితే, పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చే క్రమంలో అభినందన్ నడుపుతున్న మిగ్ విమానం పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయింది. దాంతో అభినందన్‌‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టింది. భారత సైనిక రహస్యాలు చెప్పాలంటూ పాకిస్తాన్ సైన్యం తుపాకులతో తీవ్రంగా కొట్టి హించినా ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. అంతేకాదు తన దగ్గరున్న మ్యాప్‌లను చించి, కీలక ఆధారాలను నమిలి మింగేశాడు.

అయితే, పాక్ సైన్యానికి పట్టుబడిన సమయంలో అభినందన్ చూపిన తెగువ భారత రక్షణ రహస్యాలు బయటపడకుండా ప్రవర్తించిన తీరు పాక్ సైనికుల ముందు తలవంచకుండా భరతమాతకి జైకొడుతూ తిరిగి స్వదేశంలో అడుగుపెట్టిన తీరు 130 కోట్ల భారతీయుల మదిలో నిలిచిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాక్ సైన్యానికి పట్టుబడిన అభినందన్‌ భారత దౌత్య ఒత్తిడితో మూడ్రోజుల తర్వాత అభినందన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దాంతో వాఘా సరిహద్దు దగ్గర సగర్వంగా తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టాడు‌. అభినందన్‌ దేశంలోకి కాలుపెడుతున్న దృశ్యాన్ని స్వయంగా తిలకించేందుకు లక్షలాది మంది భారతీయులు ఆనాడు వాఘా బోర్డర్‌కి వెళ్లి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక అభినందన్ చూపిన ధైర్యసాహసాలకు ఇటీవలే భారత ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారం అందజేసింది. అలాంటి అభినందన్‌ దాదాపు ఆరు నెలల విరామం తర్వాత తిరిగి విధుల్లో చేరి తొలి రోజునే మళ్లీ మిగ్‌ 21 నడిపి సంచలనం సృష్టించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories