Farmers Protest: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదన

Union ministers hold fourth round of talks with farmers in Chandigarh
x

Farmers Protest: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదన

Highlights

Farmers Protest: తెల్లవారుజామున ముగిసిన నాలుగో విడత చర్చలు

Farmers Protest: డిమాండ్ల సాధనకై ‘ఢిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం నాలుగో విడత చర్చలు జరిపింది. తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు కొనసాగాయి. పంజాబ్‌ సీఎం భగవంత్‌‌సింగ్ మాన్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు చెప్పారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో NCCF, NAFED వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.

కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదన్నారు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories