Farmers Protest: ఇవాళ మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

Today, once again the Center will hold Talks with farmers Associations
x

Farmers Protest: ఇవాళ మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

Highlights

Farmers Protest: పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన

Farmers Protest: పంటల కనీస మద్దతు ధరకు చట్టం చేయాలనే డిమాండ్‌తో రైతులు చేపట్టిన ఆందోళనలు ‎ఆరోరోజుకు చేరుకున్నాయి. ఆరు రోజులుగా పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లోనే రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా.. ఎలాగైనా ఢిల్లీకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సరిహద్దుల నుంచి వెళ్లేది లేదని ‎భీష్మించి కూర్చున్నారు రైతులు.

రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఇవాళ మరోసారి కేంద్రం వారితో చర్చలు జరపడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు మూడుసార్లు చర్చలు జరపగా.. అసంపూర్ణంగా ముగిశాయి. మద్దతు ధరకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో సరిహద్దుల్లోనే పాగా వేశారు రైతులు. దీంతో ఇవాళ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌ రైతు సంఘాలతో మరో దఫా చర్చలు జరపనున్నారు. ఇదిలా ఉంటే రైతుల సమస్యలపై ఈనెల 21న యూపీ, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ధర్నాలకు సిద్ధమైంది భారతీయ కిసాన్ యూనియన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories