Bihar: బ్రేకులు ఫెయిలై బోల్తాపడిన లారీ.. రైలు బోగీని మోసుకెళ్తుండగా ఘటన

The Lorry Overturned Due To Brake Failure In Bihar
x

Bihar: బ్రేకులు ఫెయిలై బోల్తాపడిన లారీ.. రైలు బోగీని మోసుకెళ్తుండగా ఘటన

Highlights

Bihar: ఊహించని ఘటనతో షాక్‌కు గురైన జనాలు

Bihar: బీహార్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఓ రైలు బోగీని మోసుకెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. భగల్‌పూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో జనాల రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక ఊహించని ఘటన జరగడంతో రోడ్లపై వెళ్తున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీపైన ఉన్న రైలు బోగీని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories