Narendra Modi: బాలరాముడికి సూర్య తిలకం ఓ అద్భుత ఘట్టం

Surya Tilak Was A Wonderful Moment For Bala Rama Says Narendra Modi
x

Narendra Modi: బాలరాముడికి సూర్య తిలకం ఓ అద్భుత ఘట్టం

Highlights

Narendra Modi: ఈ సూర్య కిరణాలు మనకెంతో శక్తినిస్తాయి

Narendra Modi: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు ప్రధాని మోడీ. బాలరామయ్యకు పండితులు ఘనంగా పూజలు చేస్తుండగా.. విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. దీనిపై మోడీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అయోధ్య బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడిన క్షణం కోట్లాది మంది భారతీయులతోపాటు తనకెంతో భావోద్వేగం కలిగించిందన్నారు మోడీ. అస్సాంలో ఎన్నికల ర్యాలీ అనంతరం మోడీ.. విమానంలో ప్రయాణిస్తూ ట్యాబ్‌లో ఈ అద్భుత దృశ్యాన్ని విక్షించి, బాలరాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలో రామ నవమి ఘనంగా జరగడం చరిత్రాత్మకమన్నారు. ఈ సూర్య తిలకం మన జీవితాలకు శక్తినిస్తుందన్నారు. దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరేలా స్ఫూర్తిని ఇస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories