Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident In Gujarat Ahmedabad
x

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Highlights

Gujarat: ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. అహ్మదాబాద్, వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories