Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు..

Once again, Kejriwal was absent from the ED investigation.
x

Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు..

Highlights

Arvind Kejriwal: రాజకీయ కారణాలతోనే నోటీసులన్న కేజ్రీవాల్

Arvind Kejriwal: ఈడీ అధికారులకు ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని... అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే సమన్లు పంపారన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా... అడ్డుకునేందుకే నోటీసులు ఇచ్చారన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. తప్పు చేయకపోతే ఈడీ విచారణకి కేజ్రీవాల్ హాజరుకావాలని, లేదంటే అరెస్టుకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు అంటున్నారు. రాజకీయ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని, నోటీసులు చట్ట విరుద్ధమని.. ఉపసంహరించుకోవాలని ఈడీకి కేజ్రీవాల్ లేఖలు రాశారు. కేజ్రీవాల్ ఈడీ సమన్లకు చట్టబద్ధంగా వ్యవహరిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories