సీసీ టీవీ దృశ్యం వెనుక కనబడని రహస్యాలు

సీసీ టీవీ దృశ్యం వెనుక కనబడని రహస్యాలు
x
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ నిజాముద్దీన్ మర్కజ్ గురించి అంతే కాదు ఆ హాట్ స్పాట్ గుట్టు రట్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ నిజాముద్దీన్ మర్కజ్ గురించి అంతే కాదు ఆ హాట్ స్పాట్ గుట్టు రట్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీసీ టీవీ దృశ్యం గురించి కూడా. లాక్ డౌన్ సత్ఫలితాలు మరికొద్ది రోజుల్లో వస్తాయనుకుంటున్న వేళ ఓ పెద్ద దెబ్బ పడింది. ఢిల్లీలో ఓ ఇస్లామిక్ మిషనరీ సంస్థ ప్రధాని మోడీ స్టాప్ కరోనా మిషన్ కు తూట్లు పొడిచింది. ఆ గుట్టును రట్టు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. నిజానికి ఏప్రిల్ ఏడో తేదీ నాటికి తెలంగాణ లో కరోనా వైరస్ అదుపులోకి రాగలదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారు. మనమంతా కూడా అలానే అనుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. కరోనా వైరస్ అదుపు లో భారత్ విజయం సాధిస్తుందా లేదంటే మూడో దశలోకి ప్రవేశిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయమిది. ఎన్నో దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఆ వైరస్ ను భారత్ సమర్థంగా ఎదుర్కొంటున్నదంటూ అన్ని దేశాలూ భారత్ వైపు చూస్తున్న తరుణమిది. సరిగ్గా ఈ సమయంలోనే ఢిల్లీలో కరోనా వైరస్ హాట్ స్పాట్ బైటపడింది. కశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా కరోనా వైరస్ కొత్త కేసులు బయటపడుతున్నాయి. విజయం చేతికందుతున్న వేళ అది చేజారిపోతుందేమోనన్న ఆందోళన మొదలవుతోంది.

ఒకటి కాదు రెండు కాదు ఆసేతు హిమాచలం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వందల సంఖ్యలో కొత్తగా కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ప్రాంతాలు ఒక్కసారిగా కొత్త కేసులతో అతలాకుతలమైపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా కావచ్చు లేదంటే మారుమూల ఈశాన్య రాష్ట్రం కావచ్చు. ప్రతీ చోటా కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒక వైపున విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ గడువు ముగిసిపోతున్నది. భారతదేశమా ఊపిరి పీల్చుకో అందామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కరోనా తన విశ్వరూపం ప్రదర్శించింది.

భారత్ లో మత ప్రచారం కొత్త కాదు వందల ఏళ్లుగా కొనసాగుతున్నదే. కాకపోతే మహా విపత్తులు వచ్చినప్పుడు సైతం మతానికే పెద్ద పీట వేయడం మాత్రం సహించలేని అంశమే. ఏమైతేనేం ఒక ఆశ ఇంకా సజీవంగానే ఉంది. మనమంతా ఇంట్లోనే ఉందాం. మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుదాం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories