కరోనా వైరస్ తెస్తున్న కొత్త సమస్యలు

కరోనా వైరస్ తెస్తున్న కొత్త సమస్యలు
x
Highlights

లాక్ డౌన్, షట్ డౌన్ లాంటివి దేశంలో కొత్త సమస్యలకు నాంది పలుకుతున్నాయి. ప్రజల ఆహార భద్రత, రైతన్నలు ఎదుర్కొనే సమస్యలు ఇలాంటివే. అందుకే మనం ఈ రోజు...

లాక్ డౌన్, షట్ డౌన్ లాంటివి దేశంలో కొత్త సమస్యలకు నాంది పలుకుతున్నాయి. ప్రజల ఆహార భద్రత, రైతన్నలు ఎదుర్కొనే సమస్యలు ఇలాంటివే. అందుకే మనం ఈ రోజు మాట్లాడుకుందాం కరోనా వైరస్ తెస్తున్న కొత్త సమస్యల గురించి.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడం ముఖ్యమే అదే సందర్భంలో ఎదురయ్యే ఇతర సమస్యల గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఈ విపత్తు సమయంలో ప్రాణాలు నిలబెట్టుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా పోషకాహారం తీసుకోవడం కూడాముఖ్యమే. ఇవన్నీ కూడా ఊహించని సమస్యలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఆ సమస్యలేంటో పరిష్కారాలేంటో చూద్దాం. కరోనా వైరస్ పై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాలు మంచివే. కాకపోతే ఈ పోరాట రూపాలు ఆహార భద్రతకు ముప్పు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా పై యుద్ధం ఎన్ని రోజులో తెలియదు. హీనపక్షం ఒక నెల రోజులు అని లెక్కేసుకున్నా ఆహార భద్రతపై దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఆహార భద్రత అనగానే తెర ముందు కనిపించేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించే బియ్యం, గోధుమలు, పప్పులు లాంటివే గుర్తుకొస్తాయి. కిలో బియ్యం 3 రూపాయలకు అందిస్తామని, ఇంటింటికీ తిరిగి ఇస్తామని, కొంత నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ బానే ఉన్నాయి. అయితే, ఆహార భద్రతకు సంబంధించి తెర వెనుక మరెన్నో సమస్యలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం.

మనదేశానికి ఆహార భద్రతను అందించేది రైతన్నలే. వారు వ్యవసాయం చేస్తేనే మనకు ఆహార భద్రత. వివిధ రకాల పంట ఉత్పత్తులు, ఎగుమతులు,దిగుమతులు, విత్తనోత్పత్తి, విత్తనాల రవాణ, పంపిణి, పురుగుమందులు, ఎరువులు, గోదాములు ఇవన్నీ కూడా ఆహార భద్రతను ప్రభావితం చేసే అంశాలే. ఉత్తర భారతదేశం విషయానికి వస్తే మార్చి నెలలో మొదటి మూడు వారాలు కురిసిన వర్షాలు, ఆ తరువాత కరోనా సమస్యతో ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ సాగు ప్రారంభించడాన్ని ఆలస్యం చేశాయి. దక్షిణాదిన కూడా వివిధ పంటల విషయంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రబీ పంటలు సాధారణంగా అక్టోబర్, డిసెంబర్ మొదట్లో కోతకు వస్తాయి. వాటికి సంబంధించిన పనులు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు రైతులు ఎదుర్కొనే సమస్యలు రకరకాలుగా ఉంటున్నాయి. వారు తమ పొలాలకు వెళ్లడం, కూలీలను ఏర్పాటు చేసుకోవడం లాంటి విషయాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. సామాజిక ఉపాధికల్పన పథకాలను తక్షణం వ్యవసాయంతో ప్రత్యక్షంగా అనుసంధానం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక వైపున దేశ ఆర్థికరంగం కుదేలైపోతోంది. పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. అవన్నీ కూడా ఆర్థికాంశాలకు మాత్రమే సంబంధించినవి. వ్యవసాయ రంగం కూడా దెబ్బతింటే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అది ప్రత్యక్షంగా ప్రజల ఆహారభద్రతపై ప్రభావం కనబరుస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు సాగు పనులు సజావుగా చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఈ తరహా చర్యలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇప్పుడున్నది ఒక పూట తింటూ, మరో పూట పస్తు ఉంటూ తినడానికేమీ లేకున్నా నీళ్ళుతాగుతూనో ప్రాణాలు నిలబెట్టుకునే పరిస్థితి కాదు. బలమైన ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక వ్యవస్థనూ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం కూడాఉంది. మరో వైపున లక్షలాది మంది కొత్తగా ఒక్కసారిగా పూర్తి శాకాహారులుగా మారిపోతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే కొన్ని నెలల పాటు ధాన్యాలు, పండ్లు లాంటి శాకాహార ఉత్పత్తులపై ఒత్తిళ్లు పెంచనున్నాయి. వాటిని తట్టుకోవడం ఎలా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

రైతులు ఖరీఫ్ సీజన్ కోసం సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల కాలం రైతులకే కాదు, దేశ ఆహార భద్రతకూ ఎంతో ముఖ్యమైంది. రైతుల అవసరాలకు తగినంత ఉత్పాదన, ప్రాసెసింగ్, ప్యాకింగ్ రవాణా, సకాలంలో విత్తనాల సరఫరా ఉండేలా చూసేందుకు విత్తన పరిశ్రమ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ పరిశ్రమకు అడ్డంకులు ఎదురుకాకుండా చూడాలి. ఇటీవలే ముగిసిపోయిన రబీ సీజన్ లో విత్తన పరిశ్రమ భారీ పరిమాణంలో విత్తనోత్పత్తిని చేపట్టింది. ఇప్పుడు విత్తనం పొలాల నుంచి ప్లాంట్లకు చేరుకుంటున్నది. ఇప్పుడు విత్తన కంపెనీలన్నీ కూడా భారీ పరి మాణంలో వచ్చిన విత్తనాలను శుభ్రం చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేయడం లాంటివాటితో హడావుడిగా ఉన్నాయి. విత్తన ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణాలకు సంబంధించి మార్చి నుంచి మే వరకు విత్తన పరిశ్రమ భారీసంఖ్య లో ఉపాధి కల్పిస్తుంది. ఈ యావత్ ప్రక్రియ అంతా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి కావడం దేశ ఆహార భద్రతకు ఎంతో ముఖ్యం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకునే చర్యలు రహదారి సంబంధిత సమస్యలు ఎదురుకాకుండా చూడాలి.

ఆహార ధాన్యాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లాంటి వాటి ఉ త్పత్తికి, పంపిణికి వీలుగా క్వారంటైన్ చెక్ పోస్ట్ లను యాక్సెస్ చేసేందుకు ఈ ఉత్పాదనలకు వీలు కల్పించాలి. జాతీయ, రాష్ట్ర టోల్ బూత్ లు, చెక్ పోస్ట్ ల వద్ద గ్రీన్ లేన్స్ పేరిట ప్రత్యేక ఫుడ్ లేన్స్ ప్రారంభించాలి. దాంతో అక్కడ ఆహారం, వ్యవసాయ ఇన్ పుట్ డెలివరీ వాహనాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా వెళ్ళగలుగు తాయి. వైరస్ యుద్ధం కారణంగా ప్రజల రాకపోకలకు, ఇతర వస్తువుల రవాణాలను నిరోధిస్తూ చేసిన ఏర్పాట్ల ప్రభావం వ్యవసాయం పై పడకుండా ఉంటుంది. ఆహార వస్తువులను, అగ్రి-ఇన్ పుట్స్ ను తీసుకెళ్ళే అన్ని వాహనా లు కూడా సజావుగా వెళ్తాయి. ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, చైనా వంటి పలు దేశాలు ఇదే విధమైన చర్యలు తీసుకున్నాయి. భారత్ కూడా ఆ దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వుల్లో ఎసెన్షియల్ కమాడిటీస్ కు సంబంధించిన నిర్వచనాలు అంత స్పష్టంగా లేవు. ఆహార సరఫరా వ్యవస్థకు ,రైతాంగానికి మేలు చేసేలా ఉత్తర్వులు ఉండాలి. పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే రాయితీలు లాంటివాటిని వ్యవసాయ రంగానికి కూడా వర్తింపజేయాలి. అప్పుడు మాత్రమే ఆహార భద్రత చేకూరుతుంది. లేని పక్షంలో సమస్యలు మరింత తీవ్రమవుతాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories