చంద్రయాన్‌-2పై ప్రధాని ఉద్వేగ ప్రసంగం

చంద్రయాన్‌-2పై ప్రధాని ఉద్వేగ ప్రసంగం
x
Highlights

చంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి వారి మొహాలను చూస్తూనే తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

చంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి వారి మొహాలను చూస్తూనే తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్ 2 లో తాత్కాలికంగా ఏర్పడిన ఆటంకాలు ..భవిష్యత్ విజయాలకు నాంది పలుకుతాయన్నారు. ఇస్రో సాత్ .. యావత్ భారత్ అంటూ ప్రధాని నినదించారు. దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి మహోన్నతమైనదంటూ కొనియాడారు.

చంద్రయాన్ 2 విజయం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నించారని ప్రదాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్ ప్రయోగంపై బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోడీ... చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారన్నారు. శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నం చేశారన్నారు. యావత్ దేశం శాస్త్రవేత్తల వెంట ఉన్నదని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం పొంగిపోతుందని.. శాస్త్రవేత్తల కృషి ఎన్నటికి వృధా కాదన్నారు ప్రధాని మోడీ. జాతి గర్వించే విధంగా జీవితాలను దారపోశారని.. నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. దేశం కోసం జీవితాన్నే త్యాగం చేశారని... అదైర్య పడవద్దన్నారు. శాస్త్రవేత్తల మానసిక స్థితిని అర్ధం చేసుకోగలనన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories