లోక్‌సభ ఎన్నికల వేళ డ్రాగన్‌ సరికొత్త కుట్ర.. హెచ్చరించిన మైక్రోసాఫ్ట్‌

Microsoft Reveals How China Plans To Disrupt Indian Elections Using AI
x

లోక్‌సభ ఎన్నికల వేళ డ్రాగన్‌ సరికొత్త కుట్ర.. హెచ్చరించిన మైక్రోసాఫ్ట్‌

Highlights

Microsoft: భారత్ ఎన్నికలపై చైనా కుట్ర

Microsoft: లోక్‌సభ ఎన్నికల వేళ భారత్‌పై డ్రాగన్‌ కొత్త కుట్రకు తెరతీసింది. కృత్రిమ మేధతో ఎన్నికల ఫలితాలను తారుమారు కుట్ర చేస్తోంది చైనా . భారత ఎన్నికల్లో జోక్యానికి చైనా ప్రయతిస్తునట్టు . మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్టు వెల్లడించింది. భారత్‌ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోందని తెలిపింది. దీనికోసం కృత్రిమ మేధను.అస్త్రంగా చేసుకుంటునట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. చాలా దేశాల్లో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడిస్తోంది. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్‌ ఈ సంచలన హెచ్చరిక చేసింది.

మైక్రోసాఫ్ట్‌ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్‌ ప్రకారం. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూప్‌లు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను వాడనుందని మైక్రోసాఫ్ట్‌ టీమ్‌ పేర్కొంది. ఈవిషయంలో చైనాకు ఉత్తరకొరియా కూడా పూర్తిగా సహకరిస్తునట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. అమెరికా ఎన్నికలకు కూడా ప్రభావితం చేసేందుకు చైనా ఇదే పద్దతిని ఫాలో అవుతునట్టు తెలిపింది.

కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సమావేశమయ్యారు. వారిద్దరూ ఏఐతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల గురించి చర్చించారు. ఏఐ శక్తిమంతమైనదే అయినప్పటికి సరైన శిక్షణ లేకుండా ఉపయోగిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు మోదీ. భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్‌ఫేక్‌తో తనవాయిస్ ను కూడా అనుకరించారని మోదీ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories