ఈ 7 సూత్రాలు పాటిస్తే విజయం మనదే.. ఆ 7 సూత్రాలు ఇవే..: మోదీ

ఈ 7 సూత్రాలు పాటిస్తే విజయం మనదే.. ఆ 7 సూత్రాలు ఇవే..: మోదీ
x
Highlights

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని...

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. నానాటికీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఈ సందర్భంగా కరోనాపై విజయం సాధించడానికి సప్త సూత్రాలు పేరిట ఆయన ప్రజలకు 7 సూత్రాలను వివరించారు. వాటిని కచ్చితంగా అమలు చేస్తే కరోనాపై విజయం సాధిస్తామన్నారు ప్రధాని మోడీ.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోడీ సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ భారత పౌరుడు పాటించాల్సిన ఏడు సూత్రాలను ప్రధాని సూచించారు.

ఇళ్లల్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకొండి. అంతకు ముందు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ల విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. వాళ్లకి కరోనా సోకకుండా కాపాడుకోవాలని మొదటి జాగ్రత్తగా ప్రధాని మోడీ సూచించారు. రెండవ సూత్రంగా లాక్‌డౌన్ మరియు సోషల్‌ డిస్టెన్స్‌కు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని... ఇంట్లో తయారు చేసిన మాస్కులను ఉపయోగించాలన్నారు. ఇక మూడో సూచన రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ఆరోగ్యశాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

లాక్‌డౌన్‌తో పేదలు, రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు.. ఐదో సూత్రంగా సాధ్యమైనంత వరకు.. పేదలకు సహాయం చేయాలని.. వారి ఆకలి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయాలని సూచించారు ప్రధాని మోడీ. ఇక ఆరో సూత్రంగా పని చేస్తున్న చోట.. తోటి ఉద్యోగుల పట్ల కరుణ, దయ చూపించాలన్నారు. ఏ కంపెనీ కూడా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దని స్పష్టం చేశారు. ఏడో సూత్రంగా దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించాలన్నారు.

ఈ ఏడు సూత్రాలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపిన ప్రధాని మోడీ ఈ సప్తపది విజయాన్ని అందించే మార్గం అని అన్నారు. విజయం సాధించేందుకు మనం నిష్టగా చేయాల్సిన పనులు ఇవి అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకూ ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిష్టగా పాటించాలని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories