Azam Cheema: 26/11 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి

Key Conspirator In 26 11 Mumbai Terror Attacks Dies In Pak Sources
x

Azam Cheema: 26/11 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి

Highlights

Azam Cheema: అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో జాబితా అజమ్

Azam Cheema: భారత్‌కు పీడకలగా మిగిలిపోయిన 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్‌ ఏ తాయిబా సీనియర్‌ కమాండర్‌ అజమ్‌ ఛీమా గుండెపోటుతో మృతి చెందాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఛీమా మరణించినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు విశ్వసనీయ సమాచారం. ఇతడి అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తయ్యాయి. కేవలం 26/11 దాడులే కాకుండా 2006లో ముంబైలోనే 188 మంది మృతికి కారణమైన రైళ్లలో బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారుడు ఛీమాయేనని అప్పట్లో తేల్చారు.

ఈ పేలుళ్లలో 800 మంది దాకా గాయపడ్డారు. అజమ్‌ ఛీమా అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలోనూ ఉన్నాడు. కాగా, 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 10 మంది పాకిస్థాన్‌ టెర్రరిస్టులు పాల్గొన్నారు. వీరు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి తాజజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌తో పాటు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులతో పాటు మొత్తం 166 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉండటంతో ఛీమా పేరను అమెరికా తన మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories