Jallikattu: తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు

Jallikattu Competitions in Tamil Nadu
x

Jallikattu: తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు

Highlights

Jallikattu: పాలమేడులో జల్లికట్టు పోటీలు ప్రారంభం

Jallikattu: తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రేక్షకుల హర్షధ్వానాల నడుమ అట్టహాసంగా జరుగుతున్నాయి. జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగుతాయి. పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో ఈ పోటీలను నిర్వహిస్తారు. కాగా, కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియాన్ని జనవరి 23న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. మదురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మిస్తున్న కొత్త జల్లికట్టు స్టేడియానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories