ISRO: రేపే ప్రయోగం.. సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడి

Isro to launch XPoSat aboard PSLV-C58 on New Year day
x

ISRO: రేపే ప్రయోగం.. సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడి

Highlights

ISRO: పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 1న మరో రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ మేరకు రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలతో విజయం సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ముఖ్య ప్రయోగాన్ని 2024 కొత్త సంవత్సరం తొలి రోజునే ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో జనవరి 1వ తేదిన అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్-రే‌తో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడానికి ఈ మిషన్ ను ఇస్రో ప్రారంభించనుంది. ఈ ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories