Corona Virus: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 4 వేలు దాటిన కేసుల సంఖ్య

India Active Covid Cases Cross 4000 Mark
x

Corona Virus: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 4 వేలు దాటిన కేసుల సంఖ్య

Highlights

Corona Virus: మహారాష్ట్ర థానెలో 5 JN-1 కేసులు నమోదు

Corona Virus: భారత్‌ను కరోనా వైరస్‌ మళ్లీ కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ మహమ్మారి దాడి చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం JN-1 కారణంగా దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో 4వేల54 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాటికి 3వేల742గా ఉన్న యాక్టివ్ కేసులు.., సోమవారం నాటికి 4వేలు దాటాయి.

కరోనా కారణంగా గత 24 గంటల్లో కరోనాతో కేరళలో ఒకరు మృతి చెందారు. కొవిడ్ సబ్ వేరియంట్ JN-1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు 5 లక్షల 33వేల 334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య.. 4కోట్ల,44లక్షల, 71వేల, 860కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories