కరోనా పాజిటివ్ లు మే 2 నాటికి ఎన్ని రావచ్చంటే..?

కరోనా పాజిటివ్ లు మే 2 నాటికి ఎన్ని రావచ్చంటే..?
x
Highlights

కరోనా కేసుల సంఖ్యలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన అధ్యయనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌ 15 నాటికి భారతదేశంలో కరోనా...

కరోనా కేసుల సంఖ్యలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన అధ్యయనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌ 15 నాటికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 13 వేలకు చేరుకోనుందని కొన్ని రోజులు క్రితం ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో నమోదౌతున్న కేసులను చూస్తుంటే IIM చేసిన అధ్యయనం నిజమయ్యే అవకాశాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

భారతదేశంలో ప్రముఖ వెబ్‌సైట్‌గా గుర్తింపుపొందిన ది ప్రింట్‌ కరోనా కేసుల విషయమై కొన్ని రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది. రోహ్‌తక్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ కరోనా కేసుల అంశంపై చేసిన అధ్యయనం ఆధారంగా అనేక ఆసక్తికర విషయాలను కథనంలో వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ 15 నాటికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 13 వేలకు చేరుకోనున్నట్లు IIM అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి ఐఐఎం ప్రొఫెసర్‌ ధీరజ్ శర్మ నేతృత్వం వహించారు. గణితశాస్త్రం అంచనా నమూనాలను వినియోగించి అధ్యయనం చేశారు. COVID 19INDIA. ORG వెబ్‌సైట్‌ సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ ఎనాలసిస్‌ చేశారు. ప్రొఫెసర్‌ ధీరజ్ శర్మ చేసిన అధ్యయనం నిజమయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

అధ్యయన బృందం రెండు పట్టికల ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. మొదటి పట్టిక ఏప్రిల్‌ 7 వరకు నమోదైన కేసుల వివరాలను పొందుపరిచింది. జమాత్ సంఘటన తర్వాత పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ 7 నాటికి నమోదయ్యే కేసుల ప్రిడిక్షన్‌ తయారుచేసింది. ఏప్రిల్‌ 7 నాటికి భారతదేశంలో నమోదైన కేసుల సంఖ్య 354గా ఉంది. అధ్యయన బృందం అంచనాల ప్రకారం ఆ సంఖ్య 449గా ఉంది. ప్రతి రోజూ దాదాపుగా వెయ్యి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏప్రిల్‌ 12 నాటికి భారతదేశంలో నమోదైన కేసులు COVID 19 INDIA. ORG వెబ్‌సైట్‌ ప్రకారం 8925 ఉన్నాయి. మరో 3 రోజుల్లో 13 వేలకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ఎన్నికేసులు నమోదైనా వాటికి తగ్గట్లు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి లవ్ అగర్వాల్‌ తెలిపారు. IIM అధ్యయన బృందం వెలువరించిన రెండో పట్టిక అధికారులను కలవరపెడుతోంది. ఆ పట్టిక ప్రకారం భారతదేశంలో మే 2 నాటికి కేసుల సంఖ్య 1,59, 731కి చేరుతుందని అధ్యయన బృందం తెలిపింది. ఈ సంఖ్య ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.









Show Full Article
Print Article
More On
Next Story
More Stories