GSLV MK-III ప్రయోగం విజయవంతం

GSLV MK-III Was Successful
x

GSLV MK-III ప్రయోగం విజయవంతం

Highlights

GSLV MK-III: గగనతలంలోకి దూసుకెళ్లిన భారత్ "బాహుబలి"

GSLV MK-III: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శాస్త్రవేత్తల కృషి ఫలించింది. వినువీధుల్లో విజయకాంతులు విరజిమ్ముతూ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రోదసిలోకి దూసుకెళ్లింది. కనీవినీ ఎరుగని విధంగా ఒకే సారి 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాలను తీసుకెళ్లింది. 5200 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనకేంద్ర డైరెక్టర్ రాజారాజన్ ప్రకటించారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతంకావడంతో సహచర శాస్త్రవేత్తలతో ఆనందం పంచుకున్నారు. ఆత్మీయ ఆలింగనంతో పరస్పర శుభాకాంక్షలు తెలిజేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories