Chief Justice of India: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్

Great expectations as Justice D Y Chandrachud set to take charge of Supreme Court
x

Chief Justice of India: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్

Highlights

Chief Justice of India: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును జస్టిస్ యుయు లలిత్ సిఫారసు చేశారు.

Chief Justice of India: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును జస్టిస్ యుయు లలిత్ సిఫారసు చేశారు. జస్టిస్ ఎన్‌వీ రమణ తరువాత సీజేఐగా స్వల్పకాలానికి నియమితులైన జస్టిస్ యుయు లలిత్ రిటైర్మెంట్ కానున్నారు. సంప్రదాయం ప్రకారం రిటైర్మెంట్ అవుతున్న సీజేఐ చివరి రోజున తదుపరి ప్రధాన న్యాయమూర్తితో కలిసి ధర్మాసనంపై ఆశీనులవుతారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులపాటే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటుండగా, జస్టిస్ చంద్రచూడ్ మాత్రం సుదీర్ఘకాలం అంటే రెండేళ్ల వరకు సీజేఐగా వ్యవహరించనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు.

జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13వ తేదీన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు కంటే ముందు అక్టోబర్ 31, 2013 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతకుముందు మార్చి 2000 నుంచి అక్టోబర్ 2013 వరకూ ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1998-2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక తీర్పులిచ్చారు.

విశేషమేంటంటే జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలందించారు. సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌గా 1978 నుంచి 1985 వరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎక్కువకాలం సీజేఐగా పనిచేసింది ఈయనొక్కరే.... ఆయన సుప్రీంకోర్టు 16వ న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడాయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్లపాటు సీజేఐగా వ్యవహరించనున్నారు. ఇటీవలి కాలంలో ఇదే ఎక్కువ.


Show Full Article
Print Article
Next Story
More Stories