Farmer Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన పై పోలీసుల కాల్పులు.. రైతు మృతి

Farmers Delhi chalo farmer Died at Haryana border
x

Farmer Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన పై పోలీసుల కాల్పులు.. రైతు మృతి

Highlights

Farmer Protest: భద్రతా బలగాలు, రైతుల మధ్య ఘర్షణ

Farmer Protest: తమ డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ 21 సంవత్సరాల రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందాడు. ఈ ప్రాంతంలోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి రణరంగాన్ని తలపించింది. పంజాబ్ నుంచి తరలివచ్చిన రైతులను హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరీ వద్ద పోలీసులు, భద్రతా బలగాలు అటకాయించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. ముందుకు సాగేందుకు యత్నించారు.

దీనితో వీరిని చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. పలు భద్రతా వలయాలను ఛేదించుకుంటూ, బారికేడ్లను తీసివేస్తూ రైతులు ముందుకు సాగడంతో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు రణరంగం అయింది. వీరిని నిలువరించేందుకు మధ్యాహ్యానికి మూడు సార్లు భాష్పవాయువు ప్రయోగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories