ED Raids: తమిళనాడులో ఈడీ దాడుల కలకలం.. 35 చోట్ల ఏకకాల సోదాలు

ED Raids In Tamil Nadu
x

ED Raids: తమిళనాడులో ఈడీ దాడుల కలకలం.. 35 చోట్ల ఏకకాల సోదాలు

Highlights

ED Raids: డీఎంకే నేత జాఫర్ సాదిఖ్‌, డైరెక్టర్ అమీర్ సుల్తాన్ ఇంట్లో రైడ్స్

ED Raids: పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికార డీఎంకే పార్టీ ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాలతో పాటు సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సాధిక్‌తో సంబంధం ఉందన్న అనుమానాలతో డీఎంకే నేత జాఫర్ సాదిఖ్‌‌తో పాటు డైరెక్టర్ అమీర్ సుల్తాన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజూము నుండి చెన్నై సహా 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. అమీర్ సుల్తాన్ ఇంట్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల 3 వేల 5 వందల కేజీల డ్రగ్స్ తరలింపులో సాదిఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. 2వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. నిందితుడు సాదిఖ్‌కు సినిమా పెద్దలతో పాటు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. గతంలో డీఎంకేలో ఉన్న సాదిఖ్‌ను డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో ఆ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే డీఎంకే నుంచే డ్రగ్స్ దందాకు ఆర్థిక సాయం అందినట్టు ఈడీ అనుమానిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories