ఇవాళ బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం.. ఏపీ బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత

BJP Central Election Committee Meeting today
x

ఇవాళ బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం.. ఏపీ బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత 

Highlights

BJP: పొత్తులో బీజేపీకి పది ఎమ్మెల్యే, 6 పార్లమెంటు స్థానాలు

BJP: ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై మంతనాలు చేస్తున్నారు.

టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో.. బీజేపీకి పది ఎమ్మెల్యే, 6 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. అయితే ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ ముఖ్య నాయకులు పోటీ పడటంతో.. అభ్యర్దుల ఎంపిక కష్టంగా మారింది. వైజాగ్ సీటు కోసం జీవీఎల్, అనకాపల్లి ఎంపీ కోసం సీఎం రమేష్, రాజమండ్రి సీటు కోసం పురంధేశ్వరి, సోమువీర్రాజు, రాజంపేట స్థానం కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి సీటు కోసం రత్నప్రభ, అరకు టికెట్ కోసం కొత్తపల్లి గీత...విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నింటిపై రాష్ట్ర బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇక ప్రజాక్షేత్రంలో ప్రచారానికి సిద్దం కావాల్సి ఉండటంతో.. నిర్ణయించిన స్థానాలపైనే ఫోకస్ పెట్టి... సాధ్యమైనంత వరకు బలమైన అభ్యర్దులను ఎంపిక చేయాలని కేంద్ర పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పది అసెంబ్లీ స్థానాలలో ఆశావహులతో మాట్లాడి అన్ని విధాలా బలంగా ఉన్నారనుకున్న అభ్యర్దుల జాబితాను సిద్దం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories