Jefferies Report: పెరుగుతున్న పర్యాటకం.. అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది వచ్చే అవకాశం

Ayodhya Ram Temple Will Attract 5 Crore Tourist Per Year Brokerage Firm Jefferies Says
x

Jefferies Report:: పెరుగుతున్న పర్యాటకం.. అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది వచ్చే అవకాశం

Highlights

Jefferies Report: ఆర్థిక వ్యవస్థకు తోట్పాటునిస్తుందని నివేదిక

Jefferies Report: అయోధ్య రామమందిరంప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రామ మందిర ప్రారంభోత్సవం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిస్తుందని చెప్పింది. దీంతోపాటు భారతదేశం ఒక కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌ను పొందినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగం వాటా GDPలో 6.8 శాతంగా ఉంది. ఇప్పుడు అది 2033 నాటికి 8 శాతానికి చేరుతుందని జెఫరీస్ అంచనా వేసింది.

కరోనా మహమ్మారికి ముందు, పర్యాటక రంగం 2019 ఆర్థిక సంవత్సరంలో GDPకి 194 బిలియన్ డాలర్లను అందించింది. మరికొన్ని నెలల్లో అది 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జెఫరీస్ సంస్థ చెప్పింది. అయోధ్యలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా టూరిజంలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆతిథ్యం, మొదలైన అనేక రంగాల ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. దీని ద్వారా ప్రతి ఏటా 85 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories