Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం.. 390గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Air Pollution In Delhi | Telugu News
x

Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం.. 390గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

Highlights

Delhi: నగరంలో దారుణంగా వాయు నాణ్యత

New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది.

ఇవాళ ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ 390గా నమోదైంది. తెల్లవారుజామున రోడ్డుపై పొగ మంచు కమ్ముకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, మథురా రోడ్డు, బారఖాంబా రోడ్డు, ప్రగతి మైదాన్‌ వద్ద పలు చోట్ల కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉంది. అటు ఘజియాబాద్‌లోని వసుంధరలో గాలి నాణ్యత 420కు చేరుకుంది. ఫరీదాబాద్‌లోని న్యూ ఇండస్ట్రియల్ టౌన్‌లో AQI 446గా నమోదైంది.

దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియా గేట్ వద్ద వాకింగ్ చేసేవారు, సైక్లిస్టులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాము గురుగ్రామ్ నుంచి వచ్చామని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories