Ayodhya: ఒకే గడియారం..9 దేశాల సమయం

A Clock That Will Stand As A Special Attraction In Ayodhya
x

Ayodhya: ఒకే గడియారం..9 దేశాల సమయం

Highlights

Ayodhya: గడియారాన్ని తయారు చేసిన అనిల్ సాహు అనే వ్యక్తి

Ayodhya: అయోధ్య ప్రాంతం రామమందిరం నిర్మాణంతో పాటు అనేక ప్రత్యేకతలకు నెలవు కానుంది. అయోధ్యలో రామమందిరం కోసం దేశ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. రామ మందిరంలో ప్రతిష్టించిన వస్తువులన్నీ దేశం నలమూలల నుంచీ వచ్చినవే. ఆలయ ప్రాంతంలో సమయాన్ని తెలిపేందుకు ఓ గడియారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే అందులో ప్రత్యేకం ఏముంది అనుకుంటన్నారా? అక్కడే ఉంది అసలు కథ... ఆ గడియారంలో ఏకంగా దేశాల సమయాలను తెలుసుకోవచ్చు.

తొమ్మిది దేశాల సమయాన్ని తెలిపే గడియారాన్ని అనిల్ సాహు తయారు చేశాడు. ఈ గడియారం ఒకే సూదితో ఏక కాలంలో తొమ్మిది దేశాల సమయాన్ని చెబుతుందని తెలిపాడు. ఇందులో భారత్, యూఏఈ, రష్యా, జపాన్, అమెరికా, సింగపూర్ వంటి దేశాల సమయాలను తెలియచేస్తుంది. అయితే గత 25 ఏళ్లుగా ఇలాంటి వాచ్‌ను తయారు చేయాలని ఆలోచించినట్లు అనిల్ సాహు తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories