Gaami Teaser: మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్‌సేన్‌ 'గామి' టీజర్‌ వచ్చేసింది

Vishwak Sen Gaami Teaser Out
x

Gaami Teaser: మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్‌సేన్‌ 'గామి' టీజర్‌ వచ్చేసింది

Highlights

Gaami Teaser: టాలీవుడ్ న‌టుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’. చాందిని చౌదరి కథానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

Gaami Teaser: టాలీవుడ్ న‌టుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’. చాందిని చౌదరి కథానాయిక న‌టిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వ‌హిస్తున్నాడు. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ దీనిని నిర్మించారు. ఇందులో శంకర్‌ అనే అఘోరా పాత్రలో విష్వక్‌సేన్‌ కనిపించనున్నారు. ఇందులో అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రమని మేకర్స్‌ అన్నారు. ఇక ఫిబ్రవరి 29న గామి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మార్చ్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు నీలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కేవలం క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కుతోంది. 'ఫలక్‌నుమా దాస్‌' సినిమా విడుదలకు ముందే గామి ప్రారంభమైంది. ఈ స్టోరీతో నాలుగున్నరేళ్లు ప్రయాణం చేశామని చెప్పిన విశ్వక్‌.. గామి సినిమా గ్రాఫిక్స్‌ అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories