Klin Kaara: క్లీంకార ఫొటో షేర్‌ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Upasana Shared Klin Kaaras First Independence Day Photo
x

Klin Kaara: క్లీంకార ఫొటో షేర్‌ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Highlights

Klin Kaara's First Independence Day: టాలీవుడ్‌ స్టార్‌ జంట రామ్ చ‌ర‌ణ్‌ , ఉపాస‌న దంప‌తులకు రీసెంట్ గానే పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే.

Klin Kaara's First Independence Day: టాలీవుడ్‌ స్టార్‌ జంట రామ్ చ‌ర‌ణ్‌ , ఉపాస‌న దంప‌తులకు రీసెంట్ గానే పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టారు. జూన్ 20న పాప జన్మనిచ్చినప్పటి నుంచి కొణిదెల ఫ్యామిలీలో సంతోషం రెట్టింపైంది. పాప పుట్టిన దగ్గరి నుంచి తన ఫొటో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా క్లీంకార ఫొటోను ఉపాసన షేర్‌ చేశారు.

మంగళవారం 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన తల్లిదండ్రులు జెండా ఎగురవేసిన ఫొటోను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటోలో ఉపాసన తల్లి శోభన కామినేని.. క్లిన్‌ కారాను ఎత్తుకుని కనిపించారు. ఈ ఫొటో షేర్‌ చేసిన ఉపాస‌న.. ‘అమ్మమ్మ, తాతయ్యతో అమూల్యమైన క్షణాలు. క్లిన్‌ కారా మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు’ అరి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుండగా.. ఇది చూసిన అభిమానులు క్యూట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories