Chiranjeevi vs Rajini: మెగాస్టార్ సూపర్ స్టార్ యుద్ధం.. చూసేందుకు అందరూ సిద్ధం..

Chiranjeevi vs Rajini: మెగాస్టార్ సూపర్ స్టార్ యుద్ధం.. చూసేందుకు అందరూ సిద్ధం..
x
Highlights

Chiranjeevi vs Rajini: అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు.

Chiranjeevi vs Rajini: అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. తమ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలంటూ అభిమానులు తెగ హడావుడి చేస్తుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర మంటలే..అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం బాక్సాఫీస్ పై ఎవరు పై చేయి సాధిస్తారని ఆసక్తిగా గమనిస్తుంటారు. ఫ్యాన్స్ అయితే కలెక్షన్ల లెక్కలతో హోరెత్తించేస్తారు. సంక్రాంతి పండగకి బాలయ్యతో చిరంజీవి పోటీపడ్డారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తే, బాలయ్య వీరసింహారెడ్డిగా పలకరించారు. ఈ పోరులో చిరంజీవి పై చేయి సాధించగా..ఇప్పుడు మరోసారి చిరంజీవి పోటీకి సై అంటున్నారు. అయితే ఈసారి బాలయ్యతో కాదు..మరో అగ్ర హీరోతో.

మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. వేదాళమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్...చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఇక, ఇటీవలే రిలీజ్ చేసిన చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భోళా శంకర్ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పోటీగా రజనీకాంత్ సినిమా బాక్సాఫీస్ ముందుకు వస్తోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ నటిస్తున్న సినిమా జైలర్. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. జైలర్ లో రజనీతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఉన్నాడు. మన టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నాడు. ఇలా స్టార్ స్టడెడ్ మూవీగా ఉన్న జైలర్ పై కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది.

జైలర్ సినిమాని ఆగస్ట్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అంటే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ కి ఒక రోజు ముందుగానే జైలర్ చిత్రం బాక్సాఫీసుల్ని పలకరించనుంది. ఇలా రెండు భారీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవ్వడంతో పోటీ ఎలా ఉంటుందో అని మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయల బిజినెస్ చేయొచ్చని ట్రేండ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి, మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య పోటీ బాక్సాఫీసుల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories