69th National Film Awards: నేషనల్ అవార్డు ప్రకటన.. సుకుమార్ ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్

Sukumar And Mythri Movie Makers at Allu Arjun House
x

69th National Film Awards: నేషనల్ అవార్డు ప్రకటన.. సుకుమార్ ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్

Highlights

69th National Film Awards: పార్టీ లేదా పుష్ప అంటున్నారు అల్లు అర్జున్‌ అభిమానులు.

69th National Film Awards: పార్టీ లేదా పుష్ప అంటున్నారు అల్లు అర్జున్‌ అభిమానులు. పుష్ప సినిమాతో ఇరగదీసిన అల్లు అర్జున్‌ శ్రమ ఫలించిందని చెప్పుకుంటున్నారు. పాన్‌ ఇండియా మూవీగా సిల్వర్‌ స్క్రీన్‌ మీద మెరిసింది పుష్ప. తగ్గేదెలే అంటూ తెలుగు తెర దున్ని పడేసిన అల్లు వారి వారసుడు... తన సత్తా ఏంటో చూపించాడు. ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ అవార్డుల పంట పండించారు. 69 సంవత్సరాల సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రాలేదు. ఇప్పుడు ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆయన హీరోగా వచ్చిన పుష్ప సినిమాకు గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.

ఇక విషయం తెలియడంతో అల్లు అరవింద్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ తెలిపారు. ఇక తనకు పుష్ప లాంటి సినిమాను అందించిన సుకుమార్ ను పట్టుకొని బన్నీ కంటనీరు పెట్టుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని సుకుమార్, బన్నీ ఏడ్చేశారు. అందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories