Indian 2: ఇండియన్ 2 మెయిన్ విలన్ గా ఎస్‏జే సూర్య.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

SJ Suryah To Play Key Role in Kamal Haasan Indian 2 Movie
x

Indian 2: ఇండియన్ 2 మెయిన్ విలన్ గా ఎస్‏జే సూర్య.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

Highlights

Indian 2: ఇండియన్ 2లో ఏడుగురు విలన్లు నటిస్తుండగా..మెయిన్ విలన్ గా నటించేది ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉంది.

Indian 2: దేశం మెచ్చిన డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్, లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రాలను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారు. శంకర్ చిత్రాలు అంటే భారీతనానికి మారుపేరుగా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే కదా. ఇండియన్ 2 చిత్రాన్ని సైతం ఆయన తన మార్క్ భారీతనంతో కమల్ హాసన్ హీరోగా రూపొందిస్తున్నారు.

ఇండియన్ 2 చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇందులో సేనాపతిగా కమల్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఒక ముఖ్య పాత్రలో సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఇక ఇందులో ఏడుగురు విలన్లు నటిస్తున్న విషయాన్ని గతంలోనే అనౌన్స్ చేశారు. ఒక్కో విలన్ ఒక్కో ప్రత్యేకతతో ఉంటాడు, అలాగే వాళ్ల ఆహార్యాలు కూడా భిన్నంగా ఉండనున్నాయి. ఏడుగురు విలన్లలో సముద్రఖని, బాబీ సింహాతో పాటు విదేశీ విలన్లు కూడా ఉన్నారు. అయితే మెయిన్ విలన్ ఎవరనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా శంకర్ ఉంచగా..తాజాగా ఇందుకు సంబంధించిన అప్ డేట్ నెట్టింట లీక్ అయింది.

ఇండియన్ 2 మెయిన్ విలన్ ఎవరనేది తెలిసిపోయింది. సేనాపతితో పోరాడే మెయిన్ విలన్ గా కోలీవుడ్ స్టార్ ఎస్.జే.సూర్య నటిస్తున్నారు. ఈ మేరకు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విలన్ పాత్రలను డిఫరెంట్ మ్యానరిజంతో ఎలివేట్ చేస్తూ ఎస్.జే.సూర్య సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే బిజీయెస్ట్ యాక్టర్ గా చలామణి అవుతున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు స్పైడర్ మూవీలో, విజయ్ అదిరింది మూవీలో ఎస్.జే.సూర్య విలనిజాన్ని అంత ఈజీగా మార్చిపోలేం.

ఇక ఎస్.జే. సూర్య తన పోర్షన్ షూటింగ్ ని ఇప్పటికే కంప్లీట్ చేసేశాడట. కమల్, ఎస్.జే. సూర్య మధ్య వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని చెన్నై మీడియా కోడై కూస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే, ఇండియన్ 2లో విలన్ గా నటించేందుకు ఎస్.జే.సూర్య తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం స్వీకరించినట్లు తెలుస్తోంది. ఎస్.జే. సూర్య ఇండియన్ 2లోనే కాదు రాంచరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. అంటే శంకర్ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ విలనిజాన్ని ఎస్.జే. సూర్య పండించనున్నాడు. ఇకపోతే ఇండియన్ 2 బృందం త్వరలోనే లాస్ ఏంజెల్స్ లో షూటింగ్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories