ప్రభాస్ కు బాలీవుడ్ బాద్ షా సరెండర్.. రిలీజ్ కి ముందే ఆదిపురుష్ విజయం..

Shah Rukh Khan’s Jawan Postponed Prabhas Adipurush To Occupy The Date Of 2nd June
x

ప్రభాస్ కు బాలీవుడ్ బాద్ షా సరెండర్.. రిలీజ్ కి ముందే ఆదిపురుష్ విజయం..

Highlights

Prabhas: బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ హిట్ మ్యాన్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

Prabhas: బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ హిట్ మ్యాన్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సరికొత్తగా వచ్చిన ఈ ఇమేజ్ ను బేస్ చేసుకొని ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే చేస్తున్నాడు. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ చిత్రాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసుకున్న ప్రభాస్..తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకొని రెడీ చేసుకుంటున్నాడు. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్..అన్నీ తన ఇమేజ్ కి తగ్గట్టే ఉన్నాయి. వీటిలో ఆది పురుష్ మూవీని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న ఏకకాలంలో విడుదల కానుంది. అయితే ప్రభాస్ చిత్రానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రూపంలో గట్టి పోటీ ఎదురౌతోంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ టైటిల్ తో షారుఖ్ సినిమాని రెడీ చేసుకుంటున్నాడు. ఈ మూవీని జూన్ 2న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ఆదిపురుష్, ప్రభాస్ చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉన్నా ఒక సినిమాకు మరో సినిమా పోటీ వస్తుందని ట్రేడ్ పండితులు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే షారుఖ్ గత చిత్రం పఠాన్ ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

పఠాన్ ధాటికి బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ప్రస్తుతం అదే జోష్ తో షారుఖ్ జవాన్ మూవీ చేస్తుండడంతో ఆదిపురుష్ నిలవగలదా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆదిపురుష్ కు లైన్ క్లియర్ అయింది. షారుఖ్ ఖాన్ తన జవాన్ మూవీని వాయిదా వేసుకున్నాడు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో మేకర్స్ దాదాపు మూడు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ సినిమాని ఆగస్ట్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇలా హఠాత్తుగా జవాన్ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ప్రభాస్ ఆదిపురుష్ కు చాలా ప్లస్ అయిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి, ఈ ఫేవరబుల్ కండిషన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆది పురుష్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories