Samantha: ఐస్ బాత్ తో సమంతకు టార్చర్.. రీజన్ ఇదే

Samantha Shares Ice Bath Photo and Says its Torture Time
x

Samantha: ఐస్ బాత్ తో సమంతకు టార్చర్.. రీజన్ ఇదే

Highlights

Samantha: సమంత ఈ సిరీస్ షూటింగ్ గ్యాప్ లో ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

Samantha: శాకుంతలం చిత్రంతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన వెండితెర అజంతా సమంజ ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ రీమేక్ లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే సిటాడెల్ ఇండియన్ వర్షన్ ను రూపొందిస్తుండగా ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ సిరీస్ లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

సమంత ఈ సిరీస్ షూటింగ్ గ్యాప్ లో ఐస్ బాత్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను సామ్ తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ యాక్షన్ సీన్స్ లో నటించడం టార్చర్ లా ఉందని రికవరీ కోసం ఇలా ఐస్ బాత్ టబ్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్నానని సమంత చెప్పుకొచ్చింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం సమంత కఠినమైన వర్కౌట్స్ చేస్తోంది. ప్రొఫెషనల్స్ సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటూనే ఐస్ బాత్ థెరపీ కూడా చేయించుకుంటోంది.

ఐస్ బాత్ తో ఏంటి ప్రయోజనం

ఐస్ బాత్ థెరపీతో గాయాల కారణంగా ఏర్పడే వాపును తగ్గించుకోవచ్చు. ఎక్సెసివ్ వర్కౌట్స్ తర్వాత కండరాల పనితీరును పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ఈ థెరపీ ఎంతగానో సహాయపడుతుంది. కండరాల నొప్పులను తగ్గించడమే కాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

సమంత ప్రస్తుతం మైయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. చికిత్సలో భాగంగా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే కాకుండా అంతే కఠినమైన వర్కౌట్స్ చేస్తోంది. ఐస్ థెరపీ చేయించుకుంటోంది. మొత్తానికి, గాయాలను సైతం లెక్కచేయకుండా కష్టమైన స్టంట్స్ చేస్తున్న సమంతకు సిటాడెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories