Samantha: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. సమంత ఎమోషనల్..

Samantha Emotional Tweet on Chinmayi Sripaada
x

Samantha: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. సమంత ఎమోషనల్..

Highlights

Samantha: విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’.

Samantha: విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ను మంగళవారం నిర్వహించింది. ఈ వేడుక కోసం అభిమానులు, సంగీత ప్రియులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో గాయకులు సిద్ శ్రీరాం, చిన్మయి ఇతర సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బృందం పాల్గొన్నారు.

అయితే హీరోయిన్ సమంత- సింగర్ చిన్మయి నడుమ స్నేహబంధం ఎలాంటిదో ప్రతి ఒక్కరికీ తెలుసు. కెరీర్ ఆరంభం నుంచే ఈ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సమంతకు ఎన్నో సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చింది చిన్మయి. అలా అలా వీరి నడుమ స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా చిన్మయిని ఉద్దేశిస్తూ సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

చిన్మయిది నిష్కల్మషమైన మనసు అని పేర్కొన్నారు. ‘‘చిన్మయి పాపా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ‘ఖుషి’ మ్యూజికల్‌ నైట్‌లో పాల్గొని నాపై ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు. నీ మాటలతో ఆ కార్యక్రమం నాకు మరింత ప్రత్యేకంగా మారింది. నీ మనుసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడు’’ అని సమంత పోస్టు పెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories