Sai Pallavi: సాయిపల్లవి పాన్ ఇండియా ప్రయాణం షురూ

Sai Pallavi Play Sita In Nitesh Tiwaris Ramayana
x

Sai Pallavi: సాయిపల్లవి పాన్ ఇండియా ప్రయాణం షురూ 

Highlights

Sai Pallavi: లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగచైతన్య తో జోడీ కట్టింది హీరోయిన్ సాయిపల్లవి.

Sai Pallavi: లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగచైతన్య తో జోడీ కట్టింది హీరోయిన్ సాయిపల్లవి. ఎప్పుడూ సెలెక్టీవ్ గా సినిమాలు ఎంచుకునే సాయిపల్లవి, ఆ లక్షణం వల్లే చాలా ప్రాజెక్టులు మిస్ చేసుకుందన్నారు. కాని తన పద్దతే సరైందని ఇప్పుడు నిదానంగా ప్రూవ్ అవుతోంది.

సాయిపల్లవి అంటేనే తన పాత్రకు ప్రాదాన్యం ఉంటేనే సినిమాలు చేసే హీరోయిన్. లేటయినా, వరుసగా సినిమాలు చేయకపోయినా పర్లేదు కాని, నచ్చే పాత్ర వస్తేనే ప్రాజెక్టులు సైన్ చేస్తూ వచ్చింది. హిట్, ఫ్లాపులకు అతీతంగా తన జర్నీ సాగూతూపోయింది.

తెలుగు, తమిళ్ లో సాయిపల్లవి సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉండటంతో, కొన్ని గ్లామరస్ రోల్స్ తాలూకు ఆఫర్స్ మిస్ అయ్యాయి. అయినా ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సైన్ చేసి, లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది.

సాయిపల్లవికి తెలుగులో అయితే లేడీ పవర్ స్టార్ అనేంతగా గుర్తింపు ఉంది. నటిగా, డాన్సర్ గా, అలానే తమ ఫ్యామిలీ మెంబర్ అనేలా జనాల్లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. అదంతా అందాలు ఆరబోయే పాత్రలతో కాకుండా, అంతా ఆదరించే పాత్రలు ఎంచుకోవటం వల్లే జరిగిందంటున్నారు. ఒక వైపు హిందీలో రణ్ బీర్ కపూర్ సరసన సీతగా మెరవబోతోంది. తొలి హిందీ మూవీ రామాయణం లో సీతమ్మ పాత్రలో పాతుకుపోబోతోంది. చేతినిండా ఆఫర్లతో బిజీ అయ్యింది.

బాలీవుడ్ రామాయణం, తెలుగులో మత్యకార్మికురాలిగా ప్రయోగం, తమిల్ లో శివకార్తికేయన్ తో కామెడీ ప్రయాణం.. ఇలా వరుసగా మూడు ప్రాజెక్టులతో పాన్ ఇండియా లెవల్లో జర్నీ షురూ చేసింది. బిజీ బిజీగా మారిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories