Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’పై అప్‌డేట్స్ ఏవన్న ఫ్యాన్స్.. నాకు తెలియదన్న దిల్‌రాజు..!

Ram Charan and Shankar Combo Movie Game Changer Updates
x

Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’పై అప్‌డేట్స్ ఏవన్న ఫ్యాన్స్.. నాకు తెలియదన్న దిల్‌రాజు..!

Highlights

Game Changer: శంకర్‌ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా రానున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) సినిమాను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Game Changer: శంకర్‌ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా రానున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) సినిమాను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా యూనిట్‌ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది.

ఈ కార్యక్రమంలో దిల్‌రాజు పాల్గొన్నారు. దీంతో మెగా అభిమానులకు ఛాన్స్ దొరికింది. దిల్ రాజు మాట్లాడుతున్న సమయంలో ‘గేమ్‌ ఛేంజర్‌’పై అప్‌డేట్‌ ఇంకెన్నాళ్లు ఇస్తారంటూ ఘాటుగానే అడిగేశారు. అభిమానులను శాంతింప చేసేందుకు ఏం చెప్పాలో తెలియక కాసింత టెన్షన్ పడ్డారు. అనంతంర ఈ విషయం నన్ను కాదని, డైరెక్టర్ శంకర్‌ను అడగాలంటూ దిల్‌రాజు సూచించారు.

ఈ సినిమా వచ్చే 2024 ఆగస్టు 15కి రిలీజ్ కానున్నట్లు, క్లైమాక్స్‌ సీన్స్ సినిమాకే హైలైట్‌ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ డబుల్ రోల్ చేయనున్నట్లు కూడా మాట్లాడుకుంటున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్‌ తాజాగా మొదలైంది. ఈ సినిమా రాజకీయం మిళితమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానుంది. ‘గేమ్‌ ఛేంజర్‌’లో అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక రాం చరణ్ మిగతా సినిమాల గురించి మాట్లాడితే.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న సినిమాకు సంబంధించి కూడా ఓ అప్‌డేట్ వినిపిస్తోంది. వీరి కాంబోలో వచ్చే సినిమాను కూడా 2024 లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌, విలన్‌గా విజయ్‌సేతుపతి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories