Rajinikanth-Kapil Dev: ఒకే ఫ్రేములో కపిల్, రజనీ..ఏ సినిమా కోసమంటే?

Rajinikanth Shares Pic with Kapil Dev from sets of Laal Salaam
x

Rajinikanth-Kapil Dev: ఒకే ఫ్రేములో కపిల్, రజనీ..ఏ సినిమా కోసమంటే?

Highlights

Rajinikanth-Kapil Dev: వాళ్లిద్దరూ వారివారి రంగాల్లో లెజెండ్స్..ఒకరు సినీ రంగంలో మరొకరు క్రీడారంగంలో..ఇద్దరు ఒక ఫ్రేములో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. మరి, ఆ ఇద్దరు ఎవరు..ఏ సినిమాలో కలిసి కనిపించబోతున్నారు.

Rajinikanth-Kapil Dev: వాళ్లిద్దరూ వారివారి రంగాల్లో లెజెండ్స్..ఒకరు సినీ రంగంలో మరొకరు క్రీడారంగంలో..ఇద్దరు ఒక ఫ్రేములో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. మరి, ఆ ఇద్దరు ఎవరు..ఏ సినిమాలో కలిసి కనిపించబోతున్నారు.

భారత్ లో క్రికెట్, సినిమాలకు ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు రంగాలవారిని అభిమానులు డెమీ గాడ్స్ గా కొలుస్తుంటారు. క్రికెట్, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీస్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులు చేసే సందడి మాటల్లో చెప్పలేం..ఈ రెండు రంగాలకు చెందిన అతిరథమహారథులు సినిమా కోసం చేతులు కలిపితే...ఊహించుకుంటేనే బ్లాక్ బస్టర్ బొమ్మ కనిపిస్తుంది కదా...ఓ సినిమా కోసం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆల్ టైమ్ సూపర్ స్టార్...భారత్ కు తొలిసారి వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటర్ ఇద్దరు చేతులు కలుపుతున్నారు. ఔను, సినీ, క్రీడా దిగ్గజాలు రజనీ కాంత్, కపిల్ దేవ్ ఒక సినిమాలో కలిసి అభిమానులకు కనువిందు చేయనున్నారు.

విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య లాల్ సలామ్ టైటిల్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రజనీ కాంత్ కనిపించనున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సెట్స్ పై రజనీకాంత్, కపిల్ దేవ్ కలిసి ఒక ఫోటో దిగారు. ఈ ఫోటోను రజనీ, కపిల్ ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గొప్ప వ్యక్తిని కలవడం గౌరవమని కపిల్ క్యాప్షన్ ఇవ్వగా..భారత్ కు తొలిసారి వరల్డ్ కప్ తీసుకొచ్చిన లెజెండ్ తో కలిసి నటించడం గౌరవం అంటూ రజనీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

రజనీ-కపిల్ కలిసి ఉన్న పిక్ చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. లాల్ సలామ్ చిత్రంలో కపిల్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే కపిల్ నటిస్తున్నారా లేక యాదృశ్ఛికంగా కలిశారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే, కపిల్ ఇప్పటికే ఇక్బాల్, 83, డబుల్ ఎక్స్ ఎల్ వంటి పలు చిత్రాల్లో గెస్ట్ రోల్ లో కనిపించారు. లాల్ సలామ్ లో సైతం గెస్ట్ రోల్ చేస్తున్నారేమో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక, లాల్ సలామ్ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories